Divvela Madhuri: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాధురి..

Divvela Madhuri: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాధురి..


దివ్వెల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి తెలుగుప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు చీన్ టపాక్ డుండుం అంటూ అర్థంకాని టైటిల్‌తో అందర్నీ నవ్వించేందుకు వస్తోందట మాధురి. మూవీలో ఆమె సెటప్పు, గెటప్పు చూస్తే మాధురికి తగ్గ క్యారెక్టరేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఆమె క్యారెక్టర్ పేరు గైరమ్మత్త. ముహూర్తపు షాట్‌కు నటి సమంత క్లాప్ కొట్టగా, దర్శకుడు గోపిచంద్ మలినేని తొలి షాట్‌ను డైరెక్ట్ చేశారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతున్న ఈమూవీకి వై.ఎన్ లోహిత్ దర్శకుడు. ఇప్పటికే నర్సీపట్నం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఆగస్టు నెలలో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. వినోదభరితమైన కథ, నవ్వులు పంచే సన్నివేశాలతో ‘చీన్ టపాక్ డుం డుం’ ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కానీ ఇక్కడ దివ్వెల మాధురి వేషమే,అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దివ్వెల మాధురి ప్రయాణం ఎప్పుడూ చర్చనీయాంశమే. క్లాసికల్ డ్యాన్సర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన ఆమె, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు దగ్గరైంది. ఈబంధం కారణంగా అనేక సందర్భాల్లో వార్తల్లో కూడా నిలిచారామె. గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. తర్వాత తిరుమలలో రీల్స్ చేయడం, కేక్ కట్ చేయడం వంటి ఘటనలతో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలా వరుస వివాదాలు, వార్తల మధ్య నిలిచిన మాధురి ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి అడుగుపెట్టడం మరింత టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాక్షి ధోనీ ధరించిన.. వాచీ ధర రూ. 3.1 కోట్లు!

భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌

పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..

వేసవిలోనూ మీ జుట్టును కాపాడుకోండి ఇలా..!

విశాఖ జూలో ‘ఘోస్ట్ ఆఫ్ జంగిల్’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *