Money: డబ్బు సంపాదించడమే బ్రతుకు అనుకునేరు.. ఇది తెలుసుకోకపోతే జీవితంలో మిగిలేది సున్నా..

Money: డబ్బు సంపాదించడమే బ్రతుకు అనుకునేరు.. ఇది తెలుసుకోకపోతే జీవితంలో మిగిలేది సున్నా..


మనం రోజుకు 10 గంటల నుంచి 12 గంటల పాటు కష్టపడి వేలల్లో, లక్షల్లో సంపాదిస్తాం. కానీ నెల చివరికి వచ్చేసరికి చేతిలో ఏమీ మిగలడం లేదు అనే బాధ చాలా మందిలో ఉంటుంది. సంపాదన పెరగడం గొప్ప కాదు, అది నీ దగ్గర ఎంత కాలం నిలబడుతుంది అనేదే నీ అసలైన విజయం. దీనికి పరిష్కారం మన ప్రాచీన గ్రంథాల్లోనే ఉంది. ముఖ్యంగా భీష్ముడు తన జీవితాంతం పాటించిన క్రమశిక్షణ మనకు కొన్ని అద్భుతమైన ఆర్థిక పాఠాలను నేర్పుతుంది.

1. క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహం:

భీష్ముడు తన జీవితాన్ని ఒక ప్రతిజ్ఞకు ఎలా అంకితం చేశాడో, మన ఆర్థిక జీవితానికి కూడా కొన్ని సరిహద్దులు ఉండాలి. నేటి కాలంలో ఆన్‌లైన్ షాపింగ్, క్రెడిట్ కార్డులు మనల్ని అనవసర ఖర్చుల వైపు నెడుతున్నాయి. ఒక వస్తువును చూసినప్పుడు అది మీ అవసరమా లేక కేవలం కోరికనా అని నిర్ణయించుకోలేకపోతే, మీరు సంపదను ఎప్పటికీ నిలుపుకోలేరు. భీష్ముడిలా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి.

2. భావోద్వేగాలకు తావు ఇవ్వకండి:

చాలామంది ఇతరుల మీద పోటీతో లేదా కోపంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. పక్కింటివాడు కారు కొన్నాడని మనం అప్పు చేసి మరీ కారు కొనడం భీష్మ సిద్ధాంతానికి విరుద్ధం. డబ్బు ఖర్చు చేసేటప్పుడు మెదడులో తర్కం ఉండాలి తప్ప భావోద్వేగం ఉండకూడదు.

3. ఓపికే గొప్ప ఆయుధం:

సంపద అనేది రాత్రికి రాత్రే రాదు. భీష్ముడు దశాబ్దాల పాటు ఓపికతో రాజ్యాన్ని కాపాడాడు. అలాగే మీ పెట్టుబడులు కూడా ఒక చెట్టులా పెరగడానికి సమయం పడుతుంది. ఇన్స్టంట్ రిజల్ట్స్ కోసం ఆశపడి తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం.

4. ఆడంబరాలకు దూరం:

సంపన్నత అనేది మన ప్రవర్తనలో ఉండాలి తప్ప మనం వేసుకునే బట్టల్లోనో, తిరిగే కార్లలోనో కాదు. మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ జీవనశైలి అంత సరళంగా ఉండాలి. ఎవరైతే అహంకారం కోసం డబ్బును ప్రదర్శిస్తారో, వారి దగ్గర లక్ష్మీదేవి అతిథిలా మాత్రమే ఉంటుంది.

ఇది చదవండి: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *