హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్ లింక్‌లోనూ డైరెక్ట్‌గా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2025-26 విద్యాసంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14న నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.