Headlines

మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే, ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. మైలేజ్ పెంచే బెస్ట్ ట్రిక్స్..

మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే, ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. మైలేజ్ పెంచే బెస్ట్ ట్రిక్స్..


మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే, ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. మైలేజ్ పెంచే బెస్ట్ ట్రిక్స్..

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరిగా మారింది. రోజువారీ అవసరాలకు, ఉద్యోగాలకు, ఇతర పనులకు వెళ్లాలంటే బైక్ అవసరం అనివార్యం. పొద్దున లేచినప్పటినుంచి.. రాత్రి పడుకునే వరకు ఏ పని ఉన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా.. ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే, కొంతమంది బైక్ నడిపేటప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల బైక్ మైలేజ్ చాలా తగ్గిపోతుంది. దీంతో తమ బండి కంపెనీ వారు చెప్పిన మైలేజ్ ఇవ్వడంలేదని చాలామంది వాహనదారులు వాపోతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా బైక్ మైలేజ్ పెంచుకోవచ్చని వాహన నిపుణులు పేర్కొంటున్నారు. ఈ చిట్కాలు మీ ద్విచక్ర వాహనం పనితీరును, ఇంధన సామర్థ్యాన్ని 100% పెంచుతాయంటున్నారు.. అవేంటో తెలుసుకుందాం..

  1. ముందుగా, వాహనాన్ని ఎండలో ఎక్కువసేపు పార్క్ చేయడం మానుకోవాలి. బైక్‌ను ఎండకు పెట్టడం వల్ల ఇంధనం ఆవిరి అవుతుంది. ఇంధనం ఆవిరి అయినప్పుడు ట్యాంక్‌లో ఒత్తిడి పెరుగుతుంది. పూర్తి ట్యాంక్ ఇంధనం నింపినప్పుడు పేలే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపకుండా కొంత ఖాళీ ఉంచడం మంచిది.
  2. ఎయిర్ ఫిల్టర్ శుభ్రత చాలా ముఖ్యం. ప్రతి సర్వీసింగ్‌లో ఎయిర్ ఫిల్టర్‌ను తప్పకుండా శుభ్రం చేయించాలి. అవసరమైతే, దానిని మార్చడం కూడా మంచిది. ఎయిర్ ఫిల్టర్ సరిగా లేకపోతే ఇంజిన్‌కు సరైన గాలి అందక ఇంధన దహనం సరిగా జరగదు, తద్వారా మైలేజ్ తగ్గుతుంది.
  3. కార్బొరేటర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. కొన్ని ఇంధన బంకులలో లభించే ఇంధనంలో నీరు లేదా ఇతర కల్తీలు ఉండవచ్చు. ఇవి కార్బొరేటర్‌ను ప్రభావితం చేసి, ఇంజిన్ పనితీరును, తద్వారా మైలేజ్‌ను తగ్గిస్తాయి. కార్బొరేటర్ శుభ్రంగా ఉంటే, ఇంజిన్ డెలివరీ తీసుకున్న నాటి పనితీరును అందిస్తుంది.
  4. చాలామంది వాహనదారులు బైక్ సర్వీసింగ్‌ను విస్మరిస్తుంటారు. సరైన సమయంలో సర్వీసింగ్ చేపించకపోవడం ద్వారా మైలేజ్ పడిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా, నిర్దేశిత గడువులోగా సర్వీసింగ్ చేయించాలి. రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేస్తున్నప్పటికీ మైలేజ్ పెరగకపోతే, కార్బొరేటర్ సెట్టింగ్ సరిచూసుకోవాలి. దాని పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ రీ-ట్యూనింగ్ చేయించాలి. దీనివల్ల ఇంజిన్ ప్రదర్శన మెరుగై మైలేజ్ ఇవ్వడంలో తోడ్పడుతుంది.
  5. ఇంజిన్ ఆయిల్ నాణ్యత. ఇంజిన్ బాగా పనిచేయడానికి ఇంజిన్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ ధరకు దొరికేది కాకుండా, మంచి నాణ్యత గల ఇంజిన్ ఆయిల్‌ను ఉపయోగించాలి. ఇంజిన్ ఆయిల్‌ను కూడా సర్వీస్ షెడ్యూల్ ప్రకారం మార్చుకోవాలి. అలాగే, ఎయిర్ ఫిల్టర్‌ను రెండు నెలలకు ఒకసారైనా చెక్ చేస్తుండాలి. అది పాడైపోయినట్లయితే వెంటనే కొత్తది వేసుకోవాలి.

చివరగా, డ్రైవింగ్ అలవాట్లు మైలేజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొంతమంది బైక్‌పై ఓవర్ స్పీడ్‌గా వెళ్తుంటారు. కంపెనీలు సాధారణంగా 50-60 కి.మీ/గం వేగంతో నడిపితే మైలేజ్ పెరుగుతుందని చెబుతాయి. అయితే 100-120 కి.మీ/గం వేగంతో వెళ్లడం వల్ల ఇంధన వినియోగం విపరీతంగా పెరిగి మైలేజ్ పూర్తిగా పడిపోతుంది. ఎక్సలేటర్ ఎంత ఎక్కువగా ఇస్తే, ఇంధనం వినియోగం అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవర్ స్పీడ్‌కు వెళ్లకుండా, నార్మల్ వేగంతో ప్రయాణించడం ద్వారా మాత్రమే ద్విచక్ర వాహనం సరైన మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా.. ప్రమాదాలను కూడా నివారించవచ్చు..

ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ ద్విచక్ర వాహనం మైలేజ్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు, అలాగే ఇంజిన్ ఆయుష్షును కూడా పెంపొందించవచ్చు.. మైలేజ్ తోపాటు .. ఇంకా ఏమైనా సమస్యలను గమనిస్తే.. వెంటనే.. వాహన నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *