క్రిస్పీగా, కారంగా ఉండే ఎర్రపప్పు వడలు.. ఇలా చేసి తింటే.. టేస్ట్‌ అదరిపోద్దంతే!

క్రిస్పీగా, కారంగా ఉండే ఎర్రపప్పు వడలు.. ఇలా చేసి తింటే.. టేస్ట్‌ అదరిపోద్దంతే!


క్రిస్పీగా, కారంగా ఉండే ఎర్రపప్పు వడలు.. ఇలా చేసి తింటే.. టేస్ట్‌ అదరిపోద్దంతే!

సాయంత్రం అయిందంటే చాలూ క్రిస్పీగా ఏవైనా స్నాక్స్ తినాలిని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం బయటకెళ్లి ఏది పడితే అవి తింటుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న కల్తీ నేపథ్యంలో బయటిపుడ్‌ తినడం అంత శ్రేయస్కరం కాకపోవచ్చు. అయితే మీరు సాయంత్రం స్నాక్ కోసం ఎర్ర పప్పు వడలను ట్రై చేయండి. కాస్త కారంగా క్రిస్పీ, స్పైసీగా ఉండే ఈ వడలను సాయంత్రం టీతో పాటు తింటే టేస్ట్ అదిరిపోద్దంతే. కాబట్టి వీటిని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఎర్ర కందిపప్పు వడ తయారీకి కావలసిన పదార్థాలు

  • ఎర్ర కందిపప్పు: 1 కప్పు
  • పచ్చిమిర్చి: 2
  • మిరియాల పొడి: 1/2 టీస్పూన్
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ: 1
  • ఆవ నూనె : 4 టీస్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు: 4
  • అల్లం: 1 అంగుళం ముక్క
  • జీలకర్ర పొడి: 1 టీస్పూన్
  • ఉప్పు: రుచికి సరిపడా
  • సన్నగా తరిగిన కొత్తిమీర: 2 టీస్పూన్లు

ఎర్రకంది పప్పు వడ తయారీ విధానం

మొదట ఎర్రకంది ప్పప్పును 3-4 సార్లు శుభ్రంగా కడిగి, కనీసం ఒక గంట పాటు నీళ్లలో నానబెట్టాలి. పప్పు నానిన తర్వాత అందులోని నీటిని పూర్తిగా వడకట్టాలి. మిక్సీ జార్‌లో నానిన పప్పు, వెల్లుల్లి, అల్లం మరియు పచ్చిమిర్చి వేసి, అవసరమైతే కొద్దిగా నీరు పోసి గట్టి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే వడలు క్రిస్పీగా వస్తాయి

ఇప్పుడు రుబ్బిన పిండిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి మరియు తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని, వడల ఆకారంలో ఒత్తి మెల్లగా నూనెలో వేయాలి.

అయితే వడలు మాడకుండా ఉండాలంటే మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, వడలు రెండు వైపులా బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. అంతే! ఎంతో రుచికరమైన మసూర్ దాల్ వడలు రెడీ అయినట్టే. వీటిని వేడివేడిగా పుదీనా చట్నీ లేదా టొమాటో కెచప్‌తో తింటే చాలా బాగుంటాయి. అయితే వడలు మరింత క్రిస్పీగా రావాలంటే, పిండి రుబ్బేటప్పుడు నీళ్లు చాలా తక్కువగా వాడండి. ఒకవేళ పిండి పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యప్పిండి కలుపుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *