Silent Diseases: జాగ్రత్త.. ఈ వ్యాధులు సైలెంట్‌ కిల్లర్స్..! కనీసం ఒక్క లక్షణం కూడా కనిపించదు

Silent Diseases: జాగ్రత్త.. ఈ వ్యాధులు సైలెంట్‌ కిల్లర్స్..! కనీసం ఒక్క లక్షణం కూడా కనిపించదు


సాధారణంగా శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పి, కాస్త అలసట, చికాకు అనిపిస్తే ఆరోగ్యం బాగోలేదని భావిస్తాం. కానీ కొన్ని వ్యాధులు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా నెమ్మదిగా ఒంట్లో వృద్ధి చెందుతాయి. వీటిని ‘Silent Diseases’ అంటారు . ఇలాంటి వ్యాధులు ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. అంతేకాకుండా వీటిని ఆలస్యంగా గుర్తించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అలాంటి వ్యాధులు ఏమిటి? లక్షణాలు ఎందుకు కనిపించవు? వాటిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

లక్షణాలు లేకుండా కనిపించే వ్యాధులు ఏవంటే?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, థైరాయిడ్ అసమతుల్యతలు, కొన్ని రకాల క్యాన్సర్లు ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటాయి. అవి నెమ్మదిగా శరీర అవయవాలను దెబ్బతీస్తాయి. చాలా మంది సాధారణంగా అలసట, నీరసాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. తర్వాత ఇవి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంటాయి.

లక్షణాలు వెంటనే ఎందుకు కనిపించవు?

కొన్ని వ్యాధులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి లక్షణాలు వెంటనే స్పష్టంగా కనిపించవు. శరీరం కొంతకాలం పాటు అంతర్గత మార్పులను సమతుల్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తికి ఎటువంటి అసౌకర్యం కలగకపోవచ్చు. అంతేకాకుండా ప్రారంభ లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటం వల్ల వాటిని సాధారణమైనవిగా భావించి విస్మరిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇలాంటి వ్యాధులను నివారించడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. సంవత్సరానికి ఒకసారి లేదా డాక్టర్ల సలహా మేరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. అందువల్ల శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధిని సకాలంలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. తద్వారా భవిష్యత్తులో కనిపించే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.

నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంపద్రించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *