నటుడు భాను చందర్ ఓ మాట్లాడుతూ, తెలుగు సినీ దిగ్గజాలైన ఎన్.టి. రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) లతో తనకున్న అనుబంధం, వారిలోని గొప్ప మానవతా లక్షణాలను వివరించారు. భాను చందర్ చిన్నప్పుడు ఎన్టీఆర్ తమ ఇంటికి అశోకా సంస్థ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ వెళ్తుండగా, భాను చందర్ తల్లి పిలిచి, తన పోర్షన్‌కు రానందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఎన్టీఆర్ తన వెంట వచ్చిన పెద్ద కాన్వాయ్‌ను గేట్ దగ్గరే ఆపి, ఒక్కరే 60 మెట్లు ఎక్కి పై అంతస్తులోని వారి పోర్షన్‌కు వెళ్లి ఆతిథ్యం స్వీకరించారట. అప్పుడు ఎన్టీఆర్, చిన్నారి భాను చందర్‌కు ఆశీస్సులు అందిస్తూ, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అవుతావు, తల్లిదండ్రులను మర్చిపోవద్దు అని చెప్పారట. ఇది ఎన్టీఆర్ నిరాడంబరతకు, ప్రేమకు నిదర్శనం అని భానుచందర్ అన్నారు.
ఇది కూడా చదవండి :Nagarjuna: ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?
ఆ తర్వాత కొన్నాళ్లకు, భాను చందర్ తండ్రికి క్యాన్సర్ వచ్చిందని, ఆపరేషన్‌కు రూ. 5000 అవసరమని తెలిసింది. ఆ సమయంలో భాను చందర్ ఒక సినిమాకు రూ. 5000 రెమ్యూనరేషన్ అందుకున్నారు, అందులో రూ. 500 అడ్వాన్స్ కాగా, రూ. 4500 బ్యాలెన్స్ ఉంది. రెమ్యూనరేషన్ ఆలస్యం కావడంతో, భాను చందర్ టీ నగర్‌లోని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి పరిస్థితి వివరించారట. ఎన్టీఆర్ వెంటనే సినిమా నిర్మాణ సంస్థకు ఫోన్ చేసి, రూ. 4500ను భాను చందర్ ఇంటికి పంపించేలా చూశారట. భాను చందర్ తండ్రి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఒకటిన్నర సంవత్సరం జీవించారని తెలిపారు. ఎన్టీఆర్‌ను భాను చందర్ “బోళా శంకరుడు”, “పసిపిల్లల మనస్తత్వం” ఉన్న వ్యక్తి అని భాను చందర్ అన్నారు. షూటింగ్‌లలో కూడా ఎన్టీఆర్ తన పక్కనే కూర్చోమని, తన కారులోనే ప్రయాణించమని చెప్పేవారని, తన డ్రైవర్ హరికృష్ణతో కలిసి రహస్యంగా సిగరెట్లు తాగేవారని గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి :ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే
అలాగే, అక్కినేని నాగేశ్వరరావు గారి మానవత్వాన్ని కూడా భాను చందర్ ప్రస్తావించారు. ఏఎన్నార్, ఎన్టీఆర్‌లకు మేకప్ చేసిన నాగేశ్వరరావు అనే మేకప్ ఆర్టిస్ట్ అనారోగ్యంతో నర్సింగ్ హోమ్‌లో ఉన్నప్పుడు, ఆయన కుమారుడు సుదర్శన్, భాను చందర్‌ను సంప్రదించారట. మేకప్ ఆర్టిస్ట్‌కు ఇష్టమైన హీరో ఏఎన్నార్ అని, ఆయన్ను ఒకసారి చూడాలని కోరారట. భాను చందర్ ఈ విషయాన్ని ఏఎన్నార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఉదయం ఎనిమిది గంటలకే భాను చందర్‌ను తన ఇంటికి పిలిచి, తన కారులోనే స్వయంగా నర్సింగ్ హోమ్‌కు వెళ్లి మేకప్ ఆర్టిస్ట్‌ను పరామర్శించారట. తిరిగి వచ్చేటప్పుడు భాను చందర్‌ను కూడా తన కారులోనే హోటల్ వద్ద దింపారట. “నాగేశ్వరరావు నా స్నేహితుడు, ఇది నా విధి” అని ఏఎన్నార్ చెప్పడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ఎన్టీఆర్, ఏఎన్నార్.. వారిద్దరూ కేవలం గొప్ప నటులు మాత్రమే కాదని, వ్యక్తిగత జీవితంలోనూ అత్యున్నత విలువలు, మానవత్వం కలిగినవారని భాను చందర్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.