శ్రీదేవి నో చెప్పినా.. ఆ హీరోయిన్‌తో చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.. ఇంతకీ సినిమా ఏదంటే.?

శ్రీదేవి నో చెప్పినా.. ఆ హీరోయిన్‌తో చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.. ఇంతకీ సినిమా ఏదంటే.?


తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవిల కాంబినేషన్‌కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. అయితే, వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి పక్కన నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ, శ్రీదేవి మాత్రం మెగాస్టార్ సినిమాను ఒక కండిషన్ వల్ల రిజెక్ట్ చేశారట. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

80వ దశకంలో చిరంజీవి, దర్శకుడు కోదండ రామిరెడ్డిది ఒక బెస్ట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి ఏకంగా 23 సినిమాలు చేశారు. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్ ‘కొండవీటి దొంగ’ అనే కథను సిద్ధం చేశారు. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా, ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఉంటుంది. ఆ పాత్రకు శ్రీదేవి అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను సంప్రదించారు. కథ మొత్తం విన్న శ్రీదేవి ఒక వింత కండిషన్ పెట్టారట. అదేంటంటే, సినిమా టైటిల్‌లో తన పాత్ర పేరు కూడా ఉండాలని కోరారు. అంటే ‘కొండవీటి రాణి’ అని లేదా మరొకలా తన పేరు వచ్చేలా టైటిల్ పెట్టమన్నారు.

అంత పెద్ద మాస్ హీరో సినిమాలో హీరోయిన్ పేరుకు ప్రాధాన్యత ఇస్తూ టైటిల్ పెట్టడం కష్టమని పరుచూరి బ్రదర్స్ చెప్పడంతో, శ్రీదేవి ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పాత్ర విజయశాంతిని వరించింది. ‘కొండవీటి దొంగ’ సినిమా విడుదలై ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలలకే వీరిద్దరూ కలిసి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లో నటించారు. ఈ సినిమా టైటిల్‌లో శ్రీదేవి పాత్రకు(అతిలోకసుందరి) కూడా ప్రాధాన్యత ఉండటంతో ఆమె ఒప్పుకున్నారని సమాచారం. ఏది ఏమైనా, తన పాత్ర ప్రాముఖ్యత విషయంలో శ్రీదేవి ఎంత ఖచ్చితంగా ఉండేవారో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. శ్రీదేవి ఆనాడు నో చెప్పినా, చిరంజీవి మాత్రం విజయశాంతి, రాధలతో కలిసి మరుపురాని విజయాన్ని అందుకున్నారు.

ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *