Headlines

మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ.. మండే ఎండలకు ఈ శునకం ఏం చేసిందంటే!

మనుషులైన, మూగ జీవులకైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే గురూ.. మండే ఎండలకు ఈ శునకం ఏం చేసిందంటే!


ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు కారణంగా సాధారణం కంటే ఒక నాలుగైదు డిగ్రీలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 40° డిగ్రీల నుంచి 42° డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో సత్తుపల్లి ప్రాంతవాసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇండ్లల్లో AC లు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వీధుల వెంట తిరిగే ఒక శునకం ఎండల తీవ్రతను తట్టుకోలేక నీడ కోసం వెతుక్కుంటూ..ఒక వీధిలోని ఇంటి ముందు షెడ్డు నీడ కింద పార్కింగ్ చేసి ఉన్న కారు స్థలం ఆ శునకానికి కనబడింది. వెంటనే ఆ కుక్క తను తల దాచుకోవడం కాకుండా తన బిడ్డ ( కుక్క పిల్ల ) ను ఎండ నుంచి కాపాడేందుకు నోటితో కూన ను కరచిపట్టుకొని విధులు తిరుగుతూ వచ్చి ఆ కారు నీడ లో కుక్క పిల్లను దాచుకుంది. ఎండలకు పిల్లలను బయటకు తిరగవద్దని పెద్ద వాళ్ళు హెచ్చరిస్తారు. సరిగ్గా అలానే ఈ కుక్క కూడా తన బిడ్డ ను ఎండలో తిరగ కుండా కాపాడేందుకు నోటితో కరచిపట్టుకుని నీడ లో దాచిపెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు చూసి ఆశ్చర్యానికి గురైనారు. మనుషులు లాగానే మూగ జీవాలు కూడా తమ పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంతలా శ్రమిస్తాయోనని మురిసిపోయారు. ప్రతి తల్లి తన బిడ్డలను రక్షించుకునేందుకు పడే పట్లు చూస్తే..మాతృత్వం గుర్తుకువస్తుంది. మనుషులైన..మూగ జీవాలకైన తల్లి ప్రేమ తల్లి ప్రేమే అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *