Best Bike: లీటరుకు 70 కి.మీ మైలేజ్.. సామాన్యుడికి ఈ బైక్‌ వరం.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే!

Best Bike: లీటరుకు 70 కి.మీ మైలేజ్.. సామాన్యుడికి ఈ బైక్‌ వరం.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే!


Best Bike: భారతీయ రోడ్లపై మధ్యతరగతి ప్రజల నమ్మకమైన నేస్తం ‘హీరో మోటోకార్ప్’. ముఖ్యంగా బడ్జెట్ ధరలో మైలేజ్ బైక్ కొనాలనుకునే వారికి హీరో HF 100 ఒక అద్భుతమైన ఆప్షన్. తక్కువ నిర్వహణ ఖర్చు (Maintenance), స్టైలిష్ లుక్, అద్భుతమైన మైలేజ్‌తో ఈ బైక్ మార్కెట్లో దూసుకుపోతోంది.  హీరో HF 100లో నమ్మకమైన ఇంజిన్ సామర్థ్యం ఉంది. ఇందులో 97.2cc ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. అలాగే ఇది 8000 rpm వద్ద 5.9 kW పవర్‌ను, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక టెక్నాలజీ విషయానికొస్తే.. ఇందులో ఉన్న ‘అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్’ (xSENS FI టెక్నాలజీ) వల్ల పెట్రోల్ వినియోగం తగ్గి, ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో సిటీ ట్రాఫిక్‌లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు.

మైలేజ్, కంఫర్ట్:

రోజువారీ ఆఫీస్ పనులకు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణాలకు ఈ బైక్ ఎంతో అనువైనది. ఇది లీటరుకు సుమారు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 735mm పొడవైన సీటు ఉండటం వల్ల ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేటప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కేవలం 110 కేజీల బరువు ఉండటం వల్ల రద్దీగా ఉండే రోడ్లపై బైక్‌ను హ్యాండిల్ చేయడం చాలా ఈజీ.

ముఖ్యమైన ఫీచర్లు:

సేఫ్టీ: సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, బైక్ కింద పడినప్పుడు ఇంజిన్ ఆగిపోయే ‘ఇంజిన్ కట్-ఆఫ్ ఎట్ ఫాల్’ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు 2-స్టేజ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్స్ ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా కుదుపులు తక్కువగా ఉంటాయి. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల ఎత్తుపల్లాల వద్ద బైక్ అడుగు భాగం తగలకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ధర, కలర్స్‌:

హీరో HF 100 ప్రస్తుతం బ్లూ బ్లాక్ (BLUE BLACK), రెడ్ బ్లాక్ (RED BLACK) రంగుల్లో లభిస్తోంది.

ధర: హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం రూ. 61,589 (ధర ప్రాంతాన్ని బట్టి స్వల్పంగా మారవచ్చు). తక్కువ ధరలో స్టైలిష్‌గా కనిపిస్తూ, జేబుకు చిల్లు పడకుండా మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి హీరో HF 100 బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: DMart: డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? సామాన్యుడి షాపింగ్ అడ్డా వెనుక అసలు సీక్రెట్స్ ఇవే!

ఇది కూడా చదవండి: Investment Tips: మీరు ఎందులోనైనా పెట్టుబడి పెడుతున్నారా? ముందు ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *