మన శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగం ఏదో తెలుసా..? 99శాతం మందికి తెలియదు..

మన శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగం ఏదో తెలుసా..? 99శాతం మందికి తెలియదు..


సాధారణంగా మన శరీరంలో ముక్కు లేదా చెవులు అత్యంత మురికిగా ఉండే భాగాలు అని మనం భావిస్తుంటాం. అందుకే వాటిని శుభ్రం చేసుకోవడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. కానీ శాస్త్రీయంగా చూస్తే.. మానవ శరీరంలో అన్నిటికంటే అత్యంత మురికిగా ఉండే భాగం మరొకటి ఉంది.. అదే మన బొడ్డు. అవును, మీరు విన్నది నిజమే.. బొడ్డులో వేల సంఖ్యలో బ్యాక్టీరియా, హానికర సూక్ష్మజీవులు నివాసం ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

బొడ్డు ఎందుకు ఇంత మురికిగా ఉంటుంది..?

బొడ్డు ఆకారం లోపలి వైపుకు ఉండటం వల్ల అది బ్యాక్టీరియాకు ప్రధాన నిలయంగా మారుతోంది. శరీరంలోని చెమట, చనిపోయిన చర్మ కణాలు, స్నానం చేసేటప్పుడు మిగిలిపోయే సబ్బు మరకలు, బట్టల పీచులు ఇక్కడ సులభంగా పేరుకుపోతాయి. ఒక అధ్యయనం ప్రకారం, బొడ్డులో వేలాది రకాల బ్యాక్టీరియా నివసిస్తాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అవి ఫంగస్‌గా మారి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు, దుర్వాసనకు దారితీస్తాయి.

ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి..?

చర్మ వ్యాధి నిపుణుల ప్రకారం, కొందరు వ్యక్తులు బొడ్డు పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి..

అధిక బరువు ఉన్నవారు: వీరిలో బొడ్డు లోతుగా ఉండటం వల్ల మురికి ఎక్కువగా చేరుతుంది.

డయాబెటిస్ బాధితులు: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉంటుంది.

పియర్సింగ్ చేయించుకున్నవారు: బొడ్డుకు రింగులు లేదా పియర్సింగ్ చేయించుకున్న వారు నిత్యం శుభ్రం చేసుకోకపోతే పుండ్లు పడే ప్రమాదం ఉంది.

శుభ్రం చేసుకునే సరైన పద్ధతి ఇదే..

బొడ్డును శుభ్రం చేయడానికి కఠినమైన పద్ధతులు కాకుండా సున్నితమైన పద్ధతులను పాటించాలి..

గోరువెచ్చని నీరు: స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే మురికి సులభంగా వదులుతుంది.

సున్నితమైన శుభ్రత: ఒక మెత్తని గుడ్డ లేదా దూది ముక్కతో బొడ్డు లోపలి భాగాన్ని సున్నితంగా తుడుచుకోవాలి.

ముఖ్య గమనిక: ఒకవేళ బొడ్డు వద్ద దురద, ఎరుపు రంగులోకి మారడం, నొప్పి లేదా భరించలేని దుర్వాసన వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

రెండవ మురికి భాగం ఏది..?

బొడ్డు తర్వాత మన శరీరంలో అత్యంత మురికిగా ఉండే భాగం మన నోరు. మన నోటిలో కూడా లక్షలాది బ్యాక్టీరియా ఉంటాయి. అందుకే రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం, నోటి పరిశుభ్రతను పాటించడం అత్యంత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *