Headlines

శ్రీశైలంమల్లన్న దేవస్థానం హుండీ కౌంటింగ్.. ఈసారి విదేశీ కరెన్సీ ఎంతంటే?

శ్రీశైలంమల్లన్న దేవస్థానం హుండీ కౌంటింగ్.. ఈసారి విదేశీ కరెన్సీ ఎంతంటే?


శ్రీశైలంమల్లన్న దేవస్థానం హుండీ కౌంటింగ్.. ఈసారి విదేశీ కరెన్సీ ఎంతంటే?

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 83 లక్షల 22 వేల 554 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 33 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 162 గ్రాముల 200 మిల్లి గ్రాములు బంగారం, అలానే వెండి 4 కేజీల 180 గ్రాములు లభించగా, నగదు బంగారుతో పాటు యూఎస్ఏ డాలర్లు 144, యూఐఏ దిర్హమ్స్ 90,సౌదీ రియాల్స్120, శ్రీలంక రూపీ 9870, మలేషియా రింగిట్స్151, కెనడా డాలర్లు 25,న్యూజిలాండ్ డాలర్లు 30,యూరోలు 30, ఆస్ట్రేలియా డాలర్లు 25, మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా, ఈ హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *