MI vs CSK : ఐపీఎల్ 2026లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్-క్లాసికో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘనవిజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. సంజూ శాంసన్ అజేయ సెంచరీతో చెలరేగగా, బౌలింగ్‌లో అకీల్ హొస్సేన్ ముంబై వెన్ను విరిచాడు. ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో సీఎస్కే విజయం నల్లేరుపై నడకలా సాగింది.