తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం ఖాయం..

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం ఖాయం..


మనం ఎంత బలమైన ఆహారం తీసుకున్నాం అనే దానికంటే, ఆ ఆహారం మన శరీరానికి ఎంతవరకు వంటబట్టింది అనేదే ముఖ్యం. చాలామంది పౌష్టికాహారం తింటున్నాము కదా అని ధీమాగా ఉంటారు. కానీ భోజనం చేసిన తర్వాత చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మొత్తం ఆరోగ్య వ్యవస్థనే తలకిందులు చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే మనం చేసే కొన్ని అలవాట్లు జీర్ణక్రియను మందగించడమే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తాయి. భోజనం తర్వాత మీరు చేయకూడని ఆ 4 తప్పులు ఇవే..

తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం:

భోజనం చేయగానే చాలామందికి వచ్చే మొదటి కోరిక కునుకు తీయడం. కానీ తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇది తీవ్రమైన గుండెల్లో మంటకు దారితీస్తుంది. భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2 నుండి 3 గంటల సమయం ఉండటం ఉత్తమం.

వేడి వేడి టీ లేదా కాఫీ తాగడం

చాలా మందికి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగడం ఒక వ్యసనంలా మారుతుంది. టీ, కాఫీలలో ఉండే కొన్ని మూలకాలు మనం తిన్న ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందక రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ తాగాలనుకుంటే భోజనం చేసిన 45 నిమిషాల తర్వాతే తీసుకోవాలి.

గటగటా నీళ్లు తాగేయడం

భోజనం పూర్తి చేయగానే ఒక పెద్ద గ్లాసు నీరు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు పలచబడిపోతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించి ఆహారం లోపల పులిసిపోయే అవకాశం ఉంటుంది. ఇది శరీర జీవక్రియను దెబ్బతీస్తుంది. భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి మేలు.

స్నానం చేయడం

తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారుతుంది. సాధారణంగా జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు రక్త ప్రసరణ కడుపు భాగంలో ఎక్కువగా ఉండాలి. కానీ స్నానం చేయడం వల్ల ఆ రక్త ప్రసరణ చర్మం వైపు మళ్ళుతుంది. దీనివల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. తిన్న తర్వాత కనీసం గంటన్నర సేపు ఆగి స్నానం చేయడం మంచిది.

ఆరోగ్య సూత్రం

భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మెల్లగా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చిన్న మార్పులతోనే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని మర్చిపోకండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *