సారీ హేమక్కా.. తప్పు చేశాను.. తమన్నా క్షమాపణ వైరల్ వీడియో

సారీ హేమక్కా.. తప్పు చేశాను.. తమన్నా క్షమాపణ వైరల్ వీడియో


గతంలో నటి హేమపై వచ్చిన డ్రగ్స్‌ కేసు వివాదం గురించి అందరికి తెలిసిందే. ఆ సమయంలో తాను ఏ తప్పు చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చి ఎంత పోరాడినా హేమపై చాలా మంది విరుచుకుపడ్డారు. ఆ తర్వాత బెంగుళూరు హైకోర్టు హేమకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీంతో.. హేమ ఆనందంతో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని మరోసారి నిరూపితమైందని చెప్పుకొచ్చింది. హేమపై ఆ కేసు నమోదైన సమయంలో.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ తమన్నా సింహాద్రి, కరాటే కల్యాణి కూడా ఈ అంశంపై విమర్శలకు దిగారు. దీంతో అప్పట్లో కరాటే కళ్యాణి , తమన్నా సింహాద్రిపై క్రిమినల్‌ కేసు పెట్టి పరువు నష్టం దావా వేశారు హేమ. కాగా, ఇప్పుడు హేమ విషయంలో తన తప్పు తెలుసుకుని తాను తప్పు చేశానంటూ తమన్నా.. సోమవారం ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తనను క్షమించమని హేమని కోరింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యింది. ‘సారీ హేమక్కా.. అందరూ నీ మీద బురదచల్లుతున్నప్పుడు నేను మీ వైపు నిలబడి ఉండాల్సింది. కానీ నేను కూడా వారితో కలిసిపోయి మీపై బురద చల్లాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను చేసిన దానికి పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించు ’ అని చెప్పుకొచ్చింది తమన్నా. మరి హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పది రూపాయల స్నాక్‌.. పది కోట్ల వ్యూస్‌

Allu Aravind: బన్నీ అలా ఎందుకు చేస్తాడు..? మీరు విన్నది తప్పు – అరవింద్

రోజా కూతురికి ‘Herman B Wells’ అవార్డ్‌.. గర్వంతో పొంగిపోయిన రోజా

గుంతల రోడ్లతో చికాకు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు..

Raaka: ఆందోళన వద్దు.. దీపిక వల్ల ‘రాకా’ ఆగదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *