పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహాగ్రామ్ సభ లో ప్రసంగం తర్వాత హెలిప్యాడ్ వైపు వెళ్తూ రోడ్డు పక్కన చిన్న దుకాణం వద్ద ఆగి, స్థానిక స్ట్రీట్ ఫుడ్ ఝాల్‌మురి రుచి చూశారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఆ క్షణాల ఫొటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రధాని మోదీ కొనుగోలు చేసిన ఝల్మురి ధర కేవలం రూ.10 మాత్రమే. అయితే మోదీ షేర్ చేసిన వీడియో 24 గంటల్లోపే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 11 కోట్ల వ్యూస్ దాటింది. అంతేకాదు, ఝాల్‌మురి కోసం గూగుల్‌లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెర్చ్‌లు పెరిగాయి. ఆ దుకాణం యజమాని విక్రమ్ కుమార్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మోదీ రాకతోయ ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారానని విక్రమ్ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఊహించని విధంగా ప్రజలు తన దుకాణానికి పోటెత్తుతున్నారని, ఫోన్‌కాల్స్ ఎక్కువై సమాధానం చెప్పలేక ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాల్సి వచ్చిందని తెలిపాడు. కస్టమర్లతో పాటు రీల్స్ తీసుకునేవారు, సెల్ఫీలు దిగేవారు పెరిగారని చెప్పాడు. ప్రధాని సభ ముగించుకుని హెలిప్యాడ్ వైపు వెళ్తున్నప్పుడు తన స్టాల్ వద్ద ఆగారనీ ఝాల్‌మురి ధర ఎంత అని అడిగారనీ అన్నాడు. తన నేపథ్యం, తొమ్మిదో తరగతి చదువు గురించి తెలుసుకున్నారనీ విక్రమ్ గుర్తు చేసుకున్నాడు. తరువాత మోదీ సోషల్ మీడియాలో ‘జహాగ్రామ్‌లో మసాలా ఝల్మురి రుచి చూశాను’ అని రాశారు. ఆ రోజు ఆయన నాలుగు సభలు నిర్వహించినప్పటికీ, ఆ చిన్న విరామం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా, మోదీ స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ ఒక్క క్షణం వెనుక విక్రమ్ కుటుంబం సుదీర్ఘ ప్రయాణం ఉంది. 12 ఏళ్ల క్రితం బీహార్ నుంచి జహాగ్రామ్‌కి వచ్చారు. చిన్న చిన్న స్టాళ్లలో మారుతూ, చివరికి ప్రభుత్వ అనుమతితో 77 అడుగుల స్థలం పొందారు. అక్కడే జాల్మురి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబంతో సొంతింట్లో ఉంటున్నారు. షాపు నుంచే వచ్చే ఆదాయంతో ఆ ఇల్లు నిర్మాణం సాగిందని విక్రమ్ తెలిపారు. ఇప్పుడు అతనికి దుకాణానికి రద్దీ పెరిగింది. కస్టమర్లతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Aravind: బన్నీ అలా ఎందుకు చేస్తాడు..? మీరు విన్నది తప్పు – అరవింద్
రోజా కూతురికి ‘Herman B Wells’ అవార్డ్.. గర్వంతో పొంగిపోయిన రోజా
గుంతల రోడ్లతో చికాకు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు..
Raaka: ఆందోళన వద్దు.. దీపిక వల్ల ‘రాకా’ ఆగదు
Rakasa OTT: సంగీత్ శోభన్.. రాకాస OTT అప్డేట్ !!