Window AC vs Split AC: వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చాలా మంది తమ గదులను చల్లగా ఉంచుకోవడానికి ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. మీకు విండో, స్ప్లిట్ ఏసీలలో అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. కానీ ఒక మోడల్‌ను ఎంచుకునే ముందు మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఏంటంటే విండో ఏసీ కొనాలా లేక స్ప్లిట్ ఏసీ కొనాలా? రెండూ మీ గదిని చల్లబరచడానికి పనిచేస్తాయి. కానీ వాటి డిజైన్, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ, మొత్తం అనుభవం చాలా భిన్నంగా ఉంటాయి. స్ప్లిట్, విండో ఏసీల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను అర్థం చేసుకోవడం వల్ల మీ ఇంటికి ఏది ఉత్తమమైనదో నిర్ణయించుకోవడం సులభం అవుతుంది. మీ బడ్జెట్, గది పరిమాణం, మీ సౌకర్యాన్ని బట్టి ఏ ఏసీ కొనాలనేది ఆధారపడి ఉంటుంది. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఇవే.
Gas Cylinder: ఓన్లీ ఆధార్ ఉంటే చాలు.. 5 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్.. బుకింగ్ అవసరమే లేదు!
1. శబ్దం:
- స్ప్లిట్ ఏసీ: ఇందులో కంప్రెసర్ బయట (Outdoor Unit) ఉండటం వల్ల గదిలో శబ్దం అస్సలు వినిపించదు. ప్రశాంతమైన నిద్ర కోరుకునే వారికి ఇది బెస్ట్.
- విండో ఏసీ: అన్ని భాగాలు ఒకే యూనిట్‌లో ఉండటం వల్ల కంప్రెసర్ శబ్దం కొంచెం వినిపిస్తుంది. ఇది నిద్రలో కాస్త అంతరాయం కలిగించవచ్చు.
2. మెయింటెనెన్స్, సర్వీసింగ్:
- విండో ఏసీ: దీని సర్వీసింగ్ ఖర్చు తక్కువ. విడిభాగాలు కూడా సులభంగా దొరుకుతాయి.
- స్ప్లిట్ ఏసీ: దీని మెయింటెనెన్స్, సర్వీసింగ్ ఖర్చు విండో ఏసీతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది.
3. ధర, ఇన్‌స్టాలేషన్:
- విండో ఏసీ తక్కువ ధరకు లభిస్తుంది. దీని ఇన్‌స్టాలేషన్ సులభం, ఖర్చు కూడా తక్కువ.
- స్ప్లిట్ ఏసీ ధరతో పాటు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి.
4. కూలింగ్ సామర్థ్యం
- ప్రముఖ ఏసీ తయారీ సంస్థ ‘ఓల్టాస్’ (Voltas) ప్రకారం, విండో ఏసీ కంటే స్ప్లిట్ ఏసీలు గదిని త్వరగా, సమర్థవంతంగా చల్లబరుస్తాయి. స్ప్లిట్ ఏసీలలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండటం వల్ల పెద్ద గదులకు ఇవి చాలా బాగుంటాయి. విండో ఏసీలు చిన్న లేదా మీడియం సైజ్ గదులకు సరిపోతాయి.
ఎవరు దేనిని ఎంచుకోవాలి?
మీరు విండో ఏసీ ఎంచుకోవాలంటంటే మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, తక్కువ మెయింటెనెన్స్ కోరుకుంటే, గది చిన్నదిగా ఉంటే దీనిని ఎంచుకోవడం బెస్ట్. అలాగే మీరు స్ప్లిట్ ఏసీ ఎంచుకోవాలని అనుకుంటే శబ్దం లేని కూలింగ్ కావాలనుకుంటే, గది పెద్దదైతే, గది లుక్ అందంగా కనిపించాలనుకుంటే, విద్యుత్ ఆదా (Energy Efficiency) ముఖ్యం అనుకుంటే ఇది బెస్ట్ అనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: Success Story: ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. 4 నెలల్లోనే రూ.1 కోటి విలువైన కంపెనీని నిర్మించిన 24 ఏళ్ల యువకుడు!
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి