
కొంతమంది సింగర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో లేదా సినిమా ఈవెంట్స్ లో మైక్ పెట్టుకొని స్టేజ్ ఎక్కి తమ పాటలతో ఆకట్టుకుంటూ ఉంటారు. తమ వాయిస్ తో ఆడియన్స్ ను ఉర్రుతలూగిస్తు ఉంటారు. సినిమాలో పాటలు పాడిన చాలా మంది సింగర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ ఎక్కి ఆ పాటలు పాడుతుంటారు. అయితే కొంతమంది మాత్రం పాటలు పడుతున్నట్టు వాయిస్ మాత్రమే ఇస్తూ ఉంటారు సాంగ్ మాత్రం బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటుంది. ఆడియన్స్ కొన్ని సార్లు అవి పెద్దగా పట్టించుకోరు కానీ నెటిజన్స్ మాత్రం ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ సింగర్ కూడా స్టేజ్ పై ఇలానే బిల్డప్ ఇచ్చి దొరికిపోయింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది
ఆమె స్టేజ్ పై చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆమె ఎవరో కాదు జాస్మిన్ సాండ్లాస్. రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధురంధర్ సినిమాలో ఆమె పాటలు పాడింది. ధురంధర్ సినిమాలో జాస్మిన్ సాండ్లాస్ రెండు పాటలు పాడారు. ఈ సినిమాలో ‘షరారత్’, ‘మై ఔర్ తూ’ అంటూ పాటలు పాడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలు సూపర్ హిట్ అవ్వడంతో జాస్మిన్ సాండ్లాస్ క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఈ అమ్మడు ఎక్కువగా ఈవెంట్స్ , లైవ్ కాన్సర్ట్స్ తో హడావిడి చేస్తుంది.
ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో భారీ ఈవెంట్ ప్లాన్ ఆర్గనైజర్స్. ఈ ఈవెంట్ లో జాస్మిన్ సాండ్లాస్ స్టేజ్ ఎక్కి పాటలు పాడింది. అంతే కాదు పాటలు పాడుతూ జాస్మిన్ సాండ్లాస్ చేసిన హంగామా అంత ఇంత కాదు.. తల పై వాటర్ పోసుకుంటూ.. పాప్ సింగర్ రేంజ్ లో హడావిడి చేద్దాం అనుకుంది. అయితే ఆమె రియల్ గా పాట పడటం లేదని క్లియర్ గా అర్ధమవుతుంది. కేవలం లిప్ సింక్ ఇస్తూ పడినట్టు బిల్డప్ ఇచ్చింది. మైక్ పక్కన పెట్టేసిన కూడా బ్యాగ్రౌండ్ లో సాంగ్ ప్లే అవ్వటంతో జాస్మిన్ సాండ్లాస్ అడ్డంగా దొరికేసింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!
View this post on Instagram