Central Government: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన

Central Government: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ శుభవార్త అందించింది. కరువు భత్యం(డీఏ) రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1,2026వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చేలా సవరణలు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 22వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏను బేసిక్ వేతనంలో 58 శాతం నుంచి 60 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే 2 శాతం డీఏను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో బేసిక్ శాలరీ రూ.50 వేలు పొందే ఉద్యోగికి రూ.వెయ్యి పెంపు లభిస్తుంది. రక్షణ సేవల నుంచి జీతాలు పొందే పౌర ఉద్యోగులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది.

ఇక సాయుధ దళాలు, రైల్వే ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు వెలువడతాయి. సాయుధ దళాల ఉద్యోగులకు సంబంధించి రక్షణ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వనుండగా.. రైల్వే ఉద్యోగులకు పెంపుకు సంబంధించి రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇవ్వనుంది. కేంద్రం సాధారణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతుంది. జనవరి, జులైలో పెంచుతుంది. వీటికి సంబంధించిన ప్రకటనలు మార్చి, అక్టోబర్ నెలల్లో వస్తూ ఉంటాయి. సంవత్సరానికి రెండుసార్లు వీటిని సమీక్షించి పెంచుతూ ఉంటారు. ఈ డీఏ పెంపు వల్ల దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *