రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం.. ఖరీదైన అతిథిని చూసి ఎక్కడి వారక్కడే గప్‌చూప్‌..!

రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం.. ఖరీదైన అతిథిని చూసి ఎక్కడి వారక్కడే గప్‌చూప్‌..!


పర్యాటకులు సరదాగా గడుపుతున్న సమయంలో ఒక భారీ క్రూర మృగం కళ్లముందు ప్రత్యక్షమైతే ఆ భయం వర్ణనాతీతం. జింబాబ్వేలోని ఒక హోటల్‌లో అచ్చం ఇలాంటి దృశ్యమే ఎదురైంది. 12 అడుగుల పొడవున్న ఒక భారీ నైలు మొసలి దర్జాగా హోటల్ లోపలికి నడుచుకుంటూ వచ్చింది. రిసార్ట్‌కు అనుబంధంగా ఉన్న రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. రాత్రి సమయంలో ఆహారం కోసం వెతుకుతూ వచ్చినట్లున్న ఒక 12 అడుగుల మొసలి, దర్జాగా లోపలికి ప్రవేశించింది. అక్కడ ఉన్న ఒక మెత్తని సోఫాను చూసి, దానిపై ఎక్కి ప్రశాంతంగా కూర్చుంది. ఆ దృశ్యాన్ని చూసిన పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు దాన్ని ఫోటోలు, వీడియోలు తీశారు. ఇంటర్‌నెట్‌లో పోస్ట్‌ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో ఆ మొసలి సోఫాపై చాలా రిలాక్స్డ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా అది కూడా మెనూ కార్డ్ కోసం చూస్తుందేమో అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అది ఎవరిపైనా దాడి చేయకపోవడం గమనార్హం. కాగా, సమాచారం అందుకున్న వెంటనే వన్యప్రాణి రక్షణ బృందం అక్కడకు చేరుకుంది. అంత భారీ మొసలిని పట్టుకోవడం సవాలుతో కూడుకున్న పని అయినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా వారు దానిని బంధించారు. ఆ తర్వాత దానిని సమీపంలోని నదిలో సురక్షితంగా వదిలిపెట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

వన్యప్రాణుల ఆవాసాలకు సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రకృతి, మనుషుల మధ్య పెరుగుతున్న ఈ సంఘర్షణలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *