బంగారం ధరల్లో ప్రస్తుతం భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో ఒడిదొడులకు లోనవుతున్నాయి. ఒక రోజు పెరుగుతుండగా.. మరుసటిరోజు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు గోల్డ్ రేట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెలలో ప్రస్తుతం తగ్గుతూ వస్తోన్నాయి.
అయితే రానున్న మే నెలలో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. పసిడి ధరలు పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అనే సందేహం కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో ఉంది. అంతర్జాతీయంగా యుద్ద మేఘాలు అలుముకున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్దంపై అనిశ్చితి కొనసాగుతోంది. హర్ముజ్ జలసంధికి సంబంధించి రోజుకో ప్రకటన వస్తోంది. దీంతో మే నెలలో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది.
మే నెలలో బంగారం ధరలు పెరిగే అవకాశముందని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఔన్స్ 5 వేల డాలర్లకు చేరుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మే నెలలోనే ఇది జరిగే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. భారత్తో పాటు చైనా, ఇతర సెంట్రల్ బ్యాంకులు డాలర్ మీద ఆధారపడటం భారీగా తగ్గించాయి. బంగారం నిల్వలను పెంచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కొనుగోళ్లు ఎక్కువ అయినప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతాయి.
డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం రేట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల భవిష్యత్తులో గోల్డ్ అనేది సురక్షిత సాధనంగా మారే అవకాశముంది. దీంతో బంగారం రేట్లు మే నెలలో పెరుగుతాయని అంతర్జాతీయ వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితుల్లో బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం మాత్రం లేదని, కాస్త పెరుగుదల ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామల ప్రభావం నేరుగా బంగారం ధరలపై పడుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లపై ఇవి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,750 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,850 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి రూ.2.75 లక్షల వద్ద కొనసాగుతోంది.




