సినీ నటి మీనా తన చిన్ననాటి జ్ఞాపకాలు, పాఠశాల అనుభవాలు, అలాగే తనను ఒక నటిగా తీర్చిదిద్దడంలో ప్రభావం చూపిన వారి గురించి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో వివరించారు. తాను చదువుకున్న విద్యోదయ పాఠశాలకు ముఖ్య అతిథిగా తిరిగి వెళ్లడం తనకెంతో గౌరవంగా అనిపించిందని ఆమె తెలిపారు. “ఎవరికి దక్కుతుంది అలాంటి గౌరవం?” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. చెన్నైలోని టీ.నగర్‌లో ఉన్న విద్యోదయ పాఠశాలలో చాలా మంది సినీ ప్రముఖులు విద్యను అభ్యసించారని మీనా గుర్తు చేసుకున్నారు. తన టీచర్ తనను రావాల్సిందేనని పదే పదే అడిగి, తన పేరును కూడా ఇచ్చేసారని ఆమె తెలిపారు.
Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనను సినిమా చేయమని ఎలా కోరారో, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బంది ఏమిటో మీనా వివరించారు. ఆ రోజుల్లో షూటింగ్స్ కోసం యూనిట్ మొత్తం ఎక్కువగా ఊటీకి వెళ్లేవారు. అక్కడ మిథున్ చక్రవర్తికి సొంతంగా ‘మొనార్క్’ అనే లగ్జరీ హోటల్ ఉంది. షూటింగ్ కోసం ఊటీకి వెళ్ళినప్పుడు మీనా తరచుగా అదే హోటల్‌లో బస చేసేవారు. అయితే, ఆమె హోటల్‌కు వచ్చిన ప్రతిసారీ మిథున్ చక్రవర్తి ఆమె రూమ్ దగ్గరకు వచ్చి, “నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్? నీ కోసం మంచి కథ ఉంది, బాలీవుడ్‌కు రావచ్చు కదా” అని పదే పదే అడిగేవారట. మిథున్ చక్రవర్తి స్వయంగా వచ్చి అడుగుతుంటే, ఆయనకు ‘నో’ చెప్పలేక మీనా చాలా ఇబ్బంది పడేవారట. ఆ సమయంలో మీనా సౌత్ సినిమాలతో ఎంతో బిజీగా ఉండేవారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో పని చేస్తూ కనీసం నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. అటువంటి స్థితిలో బాలీవుడ్ సినిమాకు డేట్లు కేటాయించడం ఆమెకు అసాధ్యంగా ఉండేది. ఆయన ఎక్కడ మళ్ళీ వచ్చి అడుగుతారో అన్న భయంతో, ఒకానొక దశలో “ఆ హోటల్ వద్దు.. వేరే హోటల్‌లో రూమ్ బుక్ చేయండి” అని తన మేనేజర్‌కు చెప్పినట్లు మీనా గుర్తు చేసుకున్నారు.
Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..
కేవలం డేట్ల సమస్య మాత్రమే కాకుండా, బాలీవుడ్ సినిమాల మేకింగ్‌కు చాలా సమయం పడుతుందని అప్పట్లో ఆమెకు కొందరు చెప్పారట. ఒక హిందీ సినిమా పూర్తయ్యే లోపు సౌత్‌లో పది సినిమాలు చేయవచ్చనే ఉద్దేశంతో ఆమె బాలీవుడ్ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. మిథున్ చక్రవర్తి లాంటి స్టార్ హీరో స్వయంగా ఆహ్వానించినా, తన వృత్తిపరమైన నిబద్ధత కారణంగా ఆమె ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..
Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..