Headlines

Cinema: ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు.. సినిమా ఇండస్ట్రీలోనే పెను సంచలనం ఇది

Cinema: ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు.. సినిమా ఇండస్ట్రీలోనే పెను సంచలనం ఇది


సాధారణంగా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లను చూసి చాలా మంది ఇన్ స్పైర్ అవుతారు. వారిలాగే తమ హెయిర్, డ్రస్సింగ్ స్టైల్ నుంచి ప్రతీది అనుకరించే అభిమానులు చాలా మంది ఉంటారు. అయితే ఒక సినిమాను చూసి ఇన్ స్పైర్ అయ్యి ఏకంగా ప్రాణాలు తీసుకునేవరకు వచ్చారు. నమ్మలేకున్నా ఇది పచ్చినిజం. అందులోనూ ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది ఈ సినిమాను చూసి తమ ప్రాణాలను తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోనే ఇదొక పెను సంచలనం అని చెప్పవచ్చు. ఆ సంచలనానికి ప్రధాన కారణం లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ తీసిన ‘మరో చరిత్ర ‘ సినిమా. 1978లో రిలీజైన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమలహాసన్, సరిత జంటగా నటించిన ఈ సినిమా కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, ఎమోషన్స్ అప్పటి యూత్‌ని ఒక ఊపు ఊపేశాయని చెప్పవచ్చు.

క్లైమాక్స్ చూసి 20 ప్రేమ జంటలు..

అయితే మరో చరిత్ర సినిమాకు ఎంత మంచి పేరువచ్చిందో.. దాని క్లైమాక్స్ వల్ల అంతే రీ మార్క్ వచ్చింది. ఈ సినిమాలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు క్లైమాక్స్ లో ఆత్మహత్య చేసుకుంటారు. ఓ సంఘటన వల్ల ఒక్కటి కాలేకపోతున్నామన్న బాధతో కొండపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడుతారు. అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి ఎమోషనల్ క్లైమాక్స్ రాలేదని చెప్పవచ్చు. ఈ క్లైమాక్స్ సీన్ యువతను ఎంతలా ప్రభావితం చేసిందంటే.. ప్రేమలో విఫలమైన చాలా జంటలు ఆత్మహత్య చేసుకున్నాయట. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోయినా, ఇంకేదైనా చిన్న కారణం ఉన్నా వెంటనే ‘మరో చరిత్ర’ స్ఫూర్తితో ప్రాణాలు తీసుకోవడం మొదలుపెట్టారట. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 20 ప్రేమ జంటలు ( 40 మంది) ప్రాణాలు తీసుకున్నాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఈ పరిణామాలతో దర్శకుడు కె. బాలచందర్ తీవ్రంగా కలత చెందారట. ‘నా సినీ జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఈ సినిమా తీయడమే. ఒక సినిమా ఇంతటి అనర్థాలకు దారి తీస్తుందని అనుకోలేదు. ఇం మంది ప్రాణాలను బలి తీసుకుంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను క్షమించండి.. ఇకపై ఇలాంటి విషాదాంత ప్రేమ కథలు తీయను’ అని కన్నీరు పెట్టుకున్నారట.

మరో చరిత్ర సినిమా క్లైమాక్స్ సీన్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *