Headlines

వార్నీ కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా అక్క? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే.. తయారీ చూశారంటే కళ్లు తేలేస్తారు!

వార్నీ కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా అక్క? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే.. తయారీ చూశారంటే కళ్లు తేలేస్తారు!


ప్రపంచంలో వింతలకు కొదవ లేదు. ముఖ్యంగా స్నేహితుల మధ్య జరిగే సరదా పనులు ఒక్కోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఒక మహిళ తన స్నేహితురాలికి ఇచ్చిన బహుమతి ఇప్పుడు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.
స్నేహం పేరుతో కొందరు పూలగుత్తులు, మరికొందరు చాక్లెట్లు లేదా టెడ్డీ బేర్‌లు ఇస్తుంటారు. కానీ, ఒక ముస్లిం మహిళ ఫ్రెండ్‌షిప్‌లో కొత్త రికార్డు సృష్టించింది. సాధారణంగా ఎవరైనా స్నేహితులకు పూల బొకేలు లేదా చాక్లెట్లు బహుమతిగా ఇస్తారు. కానీ, ఈ మహిళ తన స్నేహితురాలికి ఏకంగా ‘కోడి కాళ్ల బొకే’ (Chicken Feet Bouquet) ను బహుమతిగా ఇచ్చింది.

అవును మీరు విన్నది నిజమే..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ తన స్నేహితురాలి కోసం కోడి కాళ్లతో ఫ్లవర్‌ బొకేను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన స్నేహితురాలి సన్నని చేతులపై ఉన్న ఎర్రటి నెయిల్ పెయింట్ చూసి ఈ ఆలోచన వచ్చిందని ఆ మహిళ చెప్పింది. ఆమె కోడి కాళ్లను క్షుణ్ణంగా శుభ్రం చేసి, వాటికి ఎర్రటి నెయిల్ పెయింట్ పూసి, కొన్ని అలంకరణలు చేసి, ఆ తర్వాత వాటిని అందంగా ఒక పూల గుత్తిలా అమర్చింది. ఈ విలక్షణమైన బహుమతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మలేషియాకు చెందిన ఒక మహిళ తన ప్రాణస్నేహితురాలి కోసం ఒక స్పెషల్ బొకేను తయారు చేసింది. అయితే అందులో గులాబీలు లేదా ఇతర పూలు లేవు. ఆమె ఏకంగా పచ్చి కోడి కాళ్లను సేకరించి, వాటిని శుభ్రం చేసి ఒక బొకేలా అమర్చింది. ఆ బొకే మరింత అందంగా, వింతగా కనిపించడం కోసం ఆ కోడి కాళ్ల గోళ్లకు ఎరుపు రంగు నెయిల్ పాలిష్ కూడా వేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆ వీడియోలో కోడి కాళ్లను పట్టుకుని ఉన్న మహిళ, తన స్నేహితురాలికి చికెన్ ఫీట్ అంటే ప్రాణమని, అందుకే ఆమెకు ఇష్టమైన ఆహారాన్నే ఇలా వినూత్నంగా బహుమతిగా ఇచ్చానని పేర్కొంది. బొకే చుట్టూ రంగు రంగుల కాగితాలు, పూలు కూడా అమర్చి ఉండటంతో అది చూడటానికి ఒక అసలైన బొకేలాగే కనిపిస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజమైన స్నేహితురాలు అంటే ఇలాగే ఉండాలి, తన ఫ్రెండ్ కి ఇష్టమైనది ఏదో తెలిసిన వ్యక్తి అని కొందరు కామెంట్ చేశారు. ఇది చూడటానికి కొంచెం భయానకంగా ఉంది. నెయిల్ పాలిష్ వేయడం మరీ వింత అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, ఈ చికెన్ ఫీట్ బొకే ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. బహుమతి విలువైనదా కాదా అనే దానికంటే, అవతలి వ్యక్తికి ఏమి ఇష్టమో తెలుసుకుని ఇవ్వడం ముఖ్యమని ఈ మహిళ నిరూపించింది. అయితే, ఇలాంటి వింత ఆలోచనలు మాత్రం అందరికీ నచ్చకపోవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *