బెంగాల్‌ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు..!

బెంగాల్‌ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు..!


మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోయే బెంగాల్‌పై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా టూ వీలర్ రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో టూ వీలర్ రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా బైక్ ర్యాలీలపై నిషేధం, డబుల్ రైడింగ్స్‌పై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ ఆంక్షలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

మొదటి విడత పోలింగ్ జరిగే 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసీ విధించిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈసీ ఆదేశాల ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రోడ్లపై బైకులు, వాహనాలను అనుమతించరు. వైద్యం, కుటుంబ ఫంక్షన్ల వంటి ఎమర్జెన్సీ అవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, అడ్డంకులకు వీలు లేకుండా బైక్ ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించారు. అత్యవసర సందర్భాల్లో మినహా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డబుల్ రైడింగ్‌పై నిషేధం అమల్లో ఉంటుంది.

పోలింగ్ రోజు పరిమితమైన సడలింపులను ఈసీ కల్పించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్, ఇతర అత్యవసర పనుల కోసం డబుల్ రైడర్స్‌గా ట్రావెల్ చేసేందుకు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. ఎవరైనా వ్యక్తులు మినహాయింపులు కోరుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ముందస్తుగా అనుమతి పొందాల్సి ఉంటుంది. బెంగాల్ ఎన్నికల సందర్భంగా గతంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈ రకమైన నిబంధనలను తీసుకొచ్చింది.

Ec Orders

Ec Orders

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *