Cancer warning: మీ కాళ్లలో ఈ 4 మార్పులు కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త.. అవి క్యాన్సర్ సంకేతాలే!

Cancer warning: మీ కాళ్లలో ఈ 4 మార్పులు కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త.. అవి క్యాన్సర్ సంకేతాలే!


శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్నప్పుడు అవి రక్త నాళాలపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో మన కాళ్లు కొన్ని సంకేతాలను పంపిస్తాయి. ఎటువంటి గాయం తగలకుండానే ఒకటి లేదా రెండు కాళ్లు అకస్మాత్తుగా వాపుకు గురవుతుంటే దానిని తేలికగా తీసుకోకూడదు. రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడినప్పుడు ఇలాంటి వాపు కనిపిస్తుంది.

తీవ్రమైన నొప్పి: నడుస్తున్నప్పుడు లేదా నిలబడినప్పుడు కాలి కండరాలలో విపరీతమైన నొప్పి రావడం కూడా ఒక సంకేతమే. సాధారణ అలసట వల్ల వచ్చే నొప్పికి, దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది.

చర్మం రంగు మారడం: రక్తం గడ్డకట్టిన ప్రాంతంలో చర్మం ఎరుపుగా లేదా నీలం రంగులోకి మారవచ్చు. చర్మంపై ఇటువంటి అసాధారణ రంగు మార్పు కనిపిస్తే అప్రమత్తం కావాలి.

అసాధారణ వెచ్చదనం: కాలు వాపు ఉన్న ప్రదేశంలో చర్మం ముట్టుకుంటే వేడిగా అనిపించడం నొప్పి పెరిగే కొద్దీ శరీర ఉష్ణోగ్రతలో మార్పులు రావడం కూడా గమనించవలసిన విషయం.

తొలి దశలో గుర్తించడం ఎలా?
పైన పేర్కొన్న కాళ్ల లక్షణాలతో పాటు మరికొన్ని మార్పులను గమనించడం ద్వారా వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించవచ్చు. కళ్లు చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు), ఏమీ తినాలనిపించకపోవడం, వేగంగా బరువు తగ్గడం వంటివి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తొలి సంకేతాలు కావచ్చు. అలాగే కడుపు నొప్పి, మలవిసర్జన అలవాట్లలో మార్పులు తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా విపరీతమైన నీరసంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

కాళ్లలో వచ్చే మార్పులను కేవలం శారీరక శ్రమ లేదా సాధారణ నొప్పులుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి విషమించవచ్చు. చిన్న సమస్యగా అనిపించినా అది లోపల పెద్ద ఆరోగ్య సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే పైన పేర్కొన్న లక్షణాలు మీలో కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత నిపుణుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ప్రాణాపాయం నుండి కాపాడుతుంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం శరీరంలోని మార్పులను గమనిస్తూ ఉండటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులను జయించవచ్చు.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నివేదికలు సాధారణ వైద్య విశ్లేషణల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ మీరు పైన పేర్కొన్న లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *