భారత్-అమెరికా వాణిజ్య బంధంలో కొత్త అధ్యాయం.. వాషింగ్టన్‌లో కీలక చర్చలు!

భారత్-అమెరికా వాణిజ్య బంధంలో కొత్త అధ్యాయం.. వాషింగ్టన్‌లో కీలక చర్చలు!


భారతదేశం – అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా వాషింగ్టన్‌లో కీలకమైన వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.

భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, అమెరికా ప్రధాన సంధానకర్త బ్రెండన్ లించ్‌తో ముఖాముఖి చర్చలు జరపనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించి, మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగనున్నాయి. ఇప్పటికే మెజారిటీ అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, కేవలం కొన్ని సాంకేతిక అంశాలను ఖరారు చేయడమే మిగిలి ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ ఒప్పందానికి పునాదులు గతేడాది ఫిబ్రవరిలో పడ్డాయి. 2025 ఫిబ్రవరి 13న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి BTA (Bilateral Trade Agreement) పై పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఒకరి మార్కెట్లోకి మరొకరి వస్తువుల రాకపోకలను సరళీకృతం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించాలన్నది ఇద్దరు నేతల ఉమ్మడి సంకల్పం. “ట్రంప్ ప్రభుత్వం – భారత్ మధ్య చర్చలు అత్యంత సానుకూలమైన, అర్థవంతమైన దిశలో సాగుతున్నాయి.” అని ఒక ఉన్నత స్థాయి అమెరికా అధికారి తెలిపారు.

ఈ చర్చల అనంతరం భారత్, అమెరికాలు త్వరలోనే ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల అనే ప్రధాన ప్రయోజనాలు కలగనున్నాయని భావిస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులపై సుంకాలు తగ్గడం వల్ల వ్యాపార వ్యయం తగ్గుతుంది. అలాగే నిబంధనలు సులభతరం కావడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయి. ఈ ఒప్పందం కుదిరితే, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంతో పాటు ఆర్థిక రంగానికి కూడా ఇరు దేశాల మధ్య ఒక నవశకం ప్రారంభమవుతుంది. 2026, ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది అటు అమెరికా వినియోగదారులకు, ఇటు భారతీయ ఉత్పత్తిదారులకు భారీ మేలు చేకూర్చడమే కాకుండా ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *