Disco Shanthi: రామ్‌ చరణ్ ‘మగధీర’లో నటించవద్దని శ్రీహరికి చెప్పా.. ఆసక్తికర విషయం చెప్పిన డిస్కో శాంతి

Disco Shanthi: రామ్‌ చరణ్ ‘మగధీర’లో నటించవద్దని శ్రీహరికి చెప్పా.. ఆసక్తికర విషయం చెప్పిన డిస్కో శాంతి


దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మగధీర. 2009లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. దేవ్ గిల్ విలన్ గా భయపెట్టాడు. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో రియల్ స్టార్ శ్రీహరి నటించారు. షేర్ ఖాన్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత బాగా హైలెట్ అయ్యింది శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్రనే అని చెప్పుకోవచ్చు. కాగా మగధీర సినిమాకు సంబంధించి శ్రీహరి సతీమణి డిస్కో శాంతి ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మగధీర చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్‌ చేయొద్దని బావ శ్రీహరికి చెప్పానని తెలిపింది ‘ఒక హీరో భార్యగా.. హీరో వేరు.. సపోర్టింగ్ క్యారెక్టర్ వేరు కదా అనే ఆలోచన నాలో ఉండేది. రాజమౌళి సినిమాలో హీరోగా అయితేనే చేయమని బావ (శ్రీహరి)కి చెప్పేదాన్ని. కానీ సపోర్టింగ్‌ రోల్‌ అనే సరికి వద్దని చెప్పాను. మొదట బావ నాకు మగధీర కథ చెప్పలేదు. కానీ రామ్ చరణ్ సినిమాలో ఈ క్యారెక్టర్‌ లేకపోతే సినిమానే లేదనే విషయం నాకు తర్వాత అర్థమైంది రాజమౌళి గారు ఈ క్యారెక్టర్‌ను ఎంత మనసు పెట్టి చేయించారో మెల్లగా అర్థమైంది’ అని అప్పటి సంగతులను గుర్తు చేసుకుంది డిస్కో శాంతి.

కాగా డిస్కో శాంతి విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు శాంత కుమారి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మార్చుకుంది. డిస్కో శాంతి దాదాపు 900కి పైగా చిత్రాల్లో కనిపించింది. స్పెషల్ సాంగ్స్‌తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, తమిళం, మలయాళం, ఒడియా భాషల్లోనూ సినిమాలు చేసిందామె. ఇదే క్రమంలో నటుడు శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1996 వీరి వివాహం జరగ్గా అప్పటి నుంచి సినిమాలకు దూరమైందీ అందాల తార. ఎక్కువగా తన కుటుంబాన్ని చూసుకోవడానికే పరిమితమైంది. అయితే ఊహించని విధంగా శ్రీహరి 2013 అక్టోబరు 9 కాలేయ సంబంధ వ్యాధితో కన్నుమూశారు. ఇప్పుడు తన పిల్లలే లోకంగా జీవిస్తోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *