Pahalgam Terror Attack: ఉగ్రవాదమే జీవనాధారం.. పాక్ తీరుపై సెంగే సెరింగ్ తీవ్ర విమర్శలు

Pahalgam Terror Attack: ఉగ్రవాదమే జీవనాధారం.. పాక్ తీరుపై సెంగే సెరింగ్ తీవ్ర విమర్శలు


పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏప్రిల్ 22 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ క్రమంలో దీని గురించి మరోసారి చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా పాక్ సైనిక, విదేశాంగ విధానంపై గిల్గిత్-బాల్టిస్తాన్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు సెంగే సెరింగ్ తీవ్ర విమర్శలు చేశారు. పాక్ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఉగ్రవాదం లోతుగా పాతుకుపోయిందని ఆరోపించారు. పాక్ సైనిక వ్యవస్థకు ఉగ్రవాదం ఓ ఆధారభూత శక్తిగా పనిచస్తుందన్న ఆయన.. సైన్యాన్ని సమైక్యంగా ఉంచడానికి పాక్ మతాన్ని సాధనంగా ఉపయోగించుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు. పాక్ సైనిక వ్యవస్థకు ఉగ్రవాదం జీవనాధారం అని అన్నారు. శాంతికి భంగం కలిగించడానికి, భారత్, ఆఘ్గనిస్తాన్‌తో పాటు పొరుగు దేశాలపైూ వ్యూహత్మక ఆధిపత్యం కొనసాగించేందుకు ఉగ్రవాదం వారికి సహాయపడుతుందన్నారు. పహిల్గాం ఉగ్రవాది జరిగిన ఏడాది కావొస్తున్న క్రమంలో సెంగే సెరింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని పాక్ అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు.

ఉలిక్కిపడ్డ భారత్

అయితే జమ్మకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బైసారన్ మెడో సమీపంలో గన్స్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 25 మంది భారతీయులు మరణించారు. 2019లో పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించగా.. ఆ తర్వాత అదే ప్రాంతంలో జరిగిన ఘోరమైన దాడుల్లో పహిల్గామ్ కాల్పులు కూడా ఒకటి. ఈ దాడులతో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది. భారత్‌కు అన్ని దేశాలు మద్దతు పలకగా.. పాక్ తీరును తప్పుబట్టారు. ఐక్యరాజ్యసమితి కూడా స్పందించి పాక్ తీరును ఖండించింది. ఉగ్రవాద చర్యకు పాల్పడినవారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.

ఆపరేషన్ సింధూర్ సక్సెస్

ఇక పహిల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ గట్టిగా బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేలోని ఉగ్రవాదుల ఇళ్లు, స్థావరాలపై దాడులు చేపట్టింది. ఉగ్రవాదుల స్థావరాలు, ఇళ్లను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్‌లో వేలాదిమంది ఉగ్రవాదులు మృతి చెందారు. భారత్, పాక్ మధ్య కొన్ని రోజుల పాటు యుద్దం నడించింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్లు కేంద్రం ప్రకటించింది. ఉగ్రవాదాన్ని భారత్ నేరుగా ఎదుర్కుంటోందని ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి భారత్ చూపించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడితే ప్రతీకారం చర్యలు గట్టిగా ఉంటాయని భారత్ నొక్కి చెప్పింది. ఉగ్రవాదులు కాల్పులు జరిగిన కొద్ది రోజుల తర్వాత మే 7న భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *