IPL గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ Playing XI: ఐపీఎల్ 19వ సీజన్‌లోని 30వ మ్యాచ్ ఈరోజు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు బ్యాటింగ్ కు సిద్ధమైంది. గత మ్యాచ్‌తో పోలిస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. మరోవైపు, డానిష్ మాలేవార్, క్రిష్ భగత్ ముంబై తరపున అరంగేట్రం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మఆడటం లేదు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ తమ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయాలని చూస్తుండగా, వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై తమ ఓటమి పరంపరకు ముగింపు పలకాలని చూస్తోంది.
ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశం శుభ్‌మన్ గిల్‌కు కూడా ఉంది. అతను 251 పరుగులు చేసి, హైదరాబాద్ ఆటగాడు హెన్రిక్ క్లాసెన్ కంటే 32 పరుగులు వెనుకబడి ఉన్నాడు. మరోవైపు, 11 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, పర్పుల్ క్యాప్‌కు రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..