అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి

అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి


అత్తలేని కోడలు ఉత్తమురాలు అని సామెత.. అత్త లేకపోతేనే బావుణ్ణు అనుకునే కాలం ఇది. ఎందుకంటే పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను భారంగా భావించి రోడ్డుపాలు చేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కానీ మైసూరులో ఓ మహిళ ఆపదలో ఉన్న తన అత్తగారిని కాపాడుకోడానికి పెద్ద సాహసమే చేసింది. అందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ కోడలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కర్నాటక, మైసూరు నడిబొడ్డున ఉన్న సిద్ధార్థనగరలో శుక్రవారం ఉదయం ఓ భయానక ఘటన జరిగింది. శైలజ అనే మహిళ తన గదిలో నిద్రపోతోంది. ఆమె కోడలు సుజాత ఏదో పని మీద అత్తగారి దగ్గరకు వెళ్లింది. అయితే మంచంపై నిద్రపోతున్న అత్తను చూసి లోపలికి వెళ్లకుండగానే గుమ్మం వద్దే నిశ్చేష్టురాలై నిల్చుండిపోయింది. కారణం.. తన అత్త నిద్రపోతున్న మంచం కింద ఓ చిరుతపులి పడుకొని సేదదీరుతోంది. ఆ దృశ్యం చూసిన కోడలు సుజాతకు నోటమాట రాలేదు. ప్రమాదాన్ని గుర్తించిన కోడలు తేరుకొని.. తన అత్త ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనుకుంది. ఒక్క క్షణం తనకు తాను ధైర్యం చెప్పుకుంది. అనంతరం ఏమాత్రం కంగారు పడకుండా తన అత్త ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అడుగు ముందుకు వేసింది. చిరుత కంటపడకుండా అత్యంత చాకచక్యంగా నెమ్మదిగా గదిలోకి వెళ్లి, నిద్రిస్తున్న అత్తను మెల్లగా నిద్రలేపి, సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఇద్దరూ గదినుంచి బయటకు రాగానే ఆ గది తలుపులు మూసివేసి, చిరుతను లోపలే బంధించారు. ఈ విషయాన్ని సుజాత తన భర్తకు చెప్పింది. వెంటనే ఆయన అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, మత్తు ఇంజక్షన్‌ను ప్రయోగించి చిరుతను స్పృహ తప్పేలా చేసి, సురక్షితంగా బంధించారు. నగరంలోని జనావాసాల మధ్య చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అత్తను కాపాడుకోవడంలో కోడలు సుజాత ప్రదర్శించిన సమయస్ఫూర్తి, సాహసం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చూపిన ధైర్యానికి ఫిదా అయిన స్థానికులు సుజాతపై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు

రాజమండ్రిలో ఆవకాయ పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌

అనంతపురంలో అద్భుతం.. మండువేసవిలో ఉప్పొంగిన జలధార..

Pillow: ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *