ప్రస్తుతం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. అటు థియేటర్లలో సూపర్ హిట్ కావడమే కాకుండా ఇటు ఓటీటీలోనూ దూసుకుపోతున్నాయి. అయితే ఇటీవల ధురంధర్ చిత్రం పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది ఓ చిన్న మూవీ. అదే యూత్. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి సినిమాలు అరుదుగా చూస్తారు, వాటి గురించి బహిరంగంగా కూడా మాట్లాడరు. కానీ ‘యూత్’ సినిమా ఆ నటుడి హృదయాన్ని హత్తుకుంది. ఆ మూవీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..
చిత్ర బృందం మొత్తం పడిన కష్టాన్ని కొనియాడారు. “చాలా కాలం తర్వాత, ఈ సినిమా మొత్తం చూశాక నవ్వే అవకాశం నాకు దొరికింది. ‘యూత్’ ప్రేమ, స్నేహం, గాఢమైన భావోద్వేగాలతో నిండి ఉంది. ఇది తల్లిదండ్రులందరికీ అంకితం చేయబడిన కథ.” అని అన్నారు. యూత్’ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత ఏప్రిల్ 16న ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంది. ఈ చిత్ర కథ యువత ఆశయాల చుట్టూ తిరుగుతుంది, దీనిలో హాస్యం , ప్రేమ అంశాలు కూడా ఉన్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
మార్చి 19న ‘ధురందర్: ది రివెంజ్’ చిత్రంతో పాటు విడుదలైన ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అరంగేట్రం చేసిన కెన్ కరుణాస్ కథానాయకుడిగా నటించారు. సూరజ్ వెంజరమూడు, దేవదర్శిని, అనిష్మా అనిల్‌కుమార్ , ప్రియాన్షి యాదవ్ కూడా ఈ చిత్రంలో కనిపించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..