ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ: చాలామంది పుచ్చకాయను బయట నుంచి తెచ్చిన వెంటనే ముక్కలు కోసి, చల్లబడాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. కోసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని సహజమైన పోషకాలు నశించి, దాని గుణాలు మారిపోతాయి. కోసిన పండుపై త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇది కడుపునొప్పికి దారితీస్తుంది. పుచ్చకాయను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచి తినాలి. ఒకవేళ మిగిలిపోతే గాలి చొరబడకుండా మూత పెట్టి, వీలైనంత త్వరగా ముగించాలి.