తెలుగు బుల్లితెరపై ‘వంటలక్క’ ఎంత ఫేమస్సో, విలన్‌గా ‘మోనిత’ పాత్రలో శోభా శెట్టి అంతకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది నెగిటివ్ రోల్ అయినప్పటికీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయ్యింది. సీరియల్ హీరోయిన్ కంటే ఎక్కువగా పాపులారిటిని సంపాదించుకుంది. అయితే, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏ కొత్త సీరియల్‌లోనూ కనిపించలేదు. చివరకు ‘కార్తీక దీపం 2’లో కూడా ఆమె నటించడం లేదు. అయినప్పటికీ, ఆమె లైఫ్ స్టైల్, ఆదాయం చూస్తుంటే ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. శోభా శెట్టి ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ కోసం కేటాయిస్తున్నారు. ఆమెకు యూట్యూబ్‌లో దాదాపు 7 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?
తన రోజువారీ దినచర్య, ప్రయాణాలు, షాపింగ్ వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆమె పోస్ట్ చేసే ప్రతి వీడియోకు లక్షల్లో, కొన్నిసార్లు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. దీని ద్వారా నెలకు దాదాపు రూ. 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆదాయం లభిస్తున్నట్లు అంచనా కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా ఆమె భారీగానే సంపాదిస్తున్నారు. సౌందర్య సాధనాలు, దుస్తులు , ఇతర లైఫ్ స్టైల్ బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా ఆమె లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..
వివిధ టీవీ షోలలో గెస్ట్‌గా పాల్గొనడం, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. శోభా శెట్టి తన తోటి నటుడు యశ్వంత్‌తో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరిద్దరికి నిశ్చాతార్థం జరిగింది. కెరీర్ పరంగా సీరియల్స్ చేయకపోయినా, ఒక సక్సెస్‌ఫుల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి నెలకు సుమారు 10 లక్షల వరకు సంపాదిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..