Badri Movie: పవన్ కల్యాణ్ ‘బద్రి’కి 26 ఏళ్లు.. ఈ బ్లాక్ బస్టర్‌ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Badri Movie: పవన్ కల్యాణ్ ‘బద్రి’కి 26 ఏళ్లు.. ఈ బ్లాక్ బస్టర్‌ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?


ఇప్పుడంటే పెద్దగా ఫామ్ లో లేడు కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఓ ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా హీరోలను ఆయన చూపించే విధానం, పాత్రలు డిజైన్ చేసే విధానం నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి. అలాంటి పూరి జగన్నాథ్ కు బ్లాక్ బస్టర్ డెబ్యూ ఇచ్చిన చిత్ర బద్రి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా 2000 సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంటే డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ 26 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు అన్నమాట. బద్రి సినిమాతో పవర్ స్టార్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అదే సమయంలో డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. బద్రి సినిమా ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఈ సినిమాలో పవన్ సరసన రేణూ దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జున రావు, ఎం.ఎస్ నారాయణ, రమా ప్రభ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ స్టైల్, మేనరిజం, ఆటిట్యూడ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటి ఆడియన్స్ కి యానిమల్ , అర్జున్ రెడ్డి వంటి సినిమాలు తోపు యాటిట్యూడ్ తో కూడినవి గా అనిపించొచ్చు. కానీ ఇలాంటి యాటిట్యూడ్ ను 26 ఏళ్ల క్రితమే పూరి జగన్నాథ్ పవన్ కల్యాణ్ తో చేసి చూపించాడు. ముఖ్యంగా పవన్- ప్రకాశ్ రాజ్ ల మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ఇక రమణ గోగుల అందించిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.

అయితే బద్రి సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం చాలా మందికి తెలియదు. అదేంటంటే.. ఈ సినిమాకు హీరోగా పవన్ కల్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమా కథను అక్కినేని నాగార్జున కోసం రాసుకున్నారట. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసే సమయంలోనే నాగార్జున కోసమే బద్రి సినిమాను తయారు చేసుకున్నారట పూరీ. కథ కూడా వినిపించారట. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, తదితర కారణాలతో నాగ్ ఈ సినిమాను చేయలేకపోయారట. దీంతో ఈ స్టోరీ పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిందట. ఆయన కూడా కథ విని క్లైమాక్స్ మార్చి తీసుకురావాలని పూరీకి కండిషన్ పెట్టారట. కానీ తనపై పూర్తి నమ్మకం ఉన్న పూరీ అందుకు ఒప్పుకోలేదట. ఇక పవన్ కల్యాణ్ కు కూడా పూరీ కాన్ఫిడెన్స్ నచ్చడంతో బద్రి సినిమాకు ఒకే చెప్పారట. అలా ఈ బ్లాక్ బస్టర్ సినిమా పట్టాలెక్కిందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *