కొన్ని రాశుల వారికి గ్రహాల వలన అదృష్టం కలిసి వస్తుంది. కానీ కొన్ని సార్లు నక్షత్రాల ప్రభావం వలన కూడా అదృష్టం కలిసి వస్తుంది. అయితే రోహిణి నక్షత్రం ప్రభావంతో నాలుగు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
వృషభ రాశి : వృషభ రాశి వారికి రోహిణీ నక్షత్రం ప్రభావంతో కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
కన్యారాశి : కన్యా రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ లాభాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయం. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.
మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఖర్చులు తగ్గి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగుతారు. అంతే కాకుండా మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది.
తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న, సన్నకారు వ్యాపారస్తులు అన్ని విధాలుగా లాభాలను అందుకుంటారు. కళారంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే సమయం గా చెప్పవచ్చు. ప్రేమ వివాహం ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు





