కావాల్సిన పదార్థాలు: అర కిలో చికెన్, రెండు కప్పుల బియ్యం, ఒక కప్పు కొబ్బరి పాలు, రెండు ఉల్లిపాయలు, మూడు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పుదీనాను తీసుకోవాలి.
చికెన్ ఇలా మారినేషన్ చేయాలి: చికెన్లో కొద్దిగా పెరుగు, రుచిగా సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని నానానివ్వాలి.
ఆ తర్వాత కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసి బాగా వేడి చేయాలి. అది వేడయ్యాక మసాలాలు కొద్దిగా దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, మూడు యాలకులు, బిర్యానీ ఆకు వేసి బాగా వేయించాలి.
కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు కలర్లోకి వచ్చే వరకు వాటిని వేయించాలి. ఇప్పుడు దీనిలో నాలుగు పచ్చిమిర్చి, మూడు టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.
ముందుగా మారినేట్ చేసిన ఈ మిశ్రమంలో చికెన్ వేసి 15 నిమిషాల పాటు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చివర్లో పుదీనా, కొద్దిగా కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి ఆ తరువాత నానబెట్టిన బియ్యం, ఒక కప్పు కొబ్బరి పాలు, అవసరమైన నీళ్లు పోయాలి. ఉప్పు వేసి 23 విజిల్స్ వచ్చేవరకు బాగా ఉడికించాలి.




