ఇదేం పాట రా అయ్యా.. సాంగ్ విని 100 మంది చనిపోయారు.. మీరు విన్నారో..

ఇదేం పాట రా అయ్యా.. సాంగ్ విని 100 మంది చనిపోయారు.. మీరు విన్నారో..


సినిమా ఏదైనా, భాష ఏదైనా.. పాటలు మనిషికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ ప్రపంచ చరిత్రలో ఒక పాట మాత్రం అందుకు పూర్తి రివర్స్. ఆ పాట వింటే మనసు తేలిపోదు.. బదులుగా మనిషి మరణం వైపు అడుగులు వేస్తాడు. వందల మంది ఆత్మహత్యలకు కారణమై, చివరకు ప్రభుత్వాలే నిషేధించేలా చేసిన ఆ పాట పేరే గ్లూమీ సండే. 1933లో హంగేరీకి చెందిన రెజ్సో సెరెస్ ఈ పాటను స్వరపరిచారు. 1935లో విడుదలైన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఈ పాట విడుదలైన కొద్ది కాలానికే హంగేరీలో ఆత్మహత్యల పరంపర మొదలైంది. ఒక వ్యక్తి ఈ పాట వింటూ ఆత్మహత్య చేసుకుని, తన మరణ వాంగ్మూలంలో ఈ పాటలోని సాహిత్యం తనను ప్రభావితం చేసిందని రాశాడు. అప్పటి నుండి ఈ పాటను హంగేరియన్ సూసైడ్ సాంగ్ అని పిలవడం ప్రారంభించారు.

సృష్టికర్తలనే వదలని శాపం

ఈ పాట ఎంతటి విషాదాన్ని నింపుకుందంటే.. దీనిని రాసిన వారి జీవితాలను కూడా ఇది బలితీసుకుంది. ఈ పాట రాసిన రెజ్సో సెరెస్ స్నేహితురాలు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. చివరకు 1968లో రెజ్సో కూడా ఒక భవనం పైనుంచి దూకి ప్రాణాలు వదిలాడు. ఈ పాట విన్న ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చుకోగా, ఒక మహిళ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మొత్తం మీద ఈ పాట ప్రభావంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని రికార్డులు చెబుతున్నాయి.

అసలు ఆ పాటలో ఏముంది?

పరిశోధకుల విశ్లేషణ ప్రకారం.. ఆ సమయంలో హంగేరీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి, ఆకలితో, ఒత్తిడితో అల్లాడుతున్నారు. అటువంటి సమయంలో వచ్చిన ఈ పాటలోని సాహిత్యం మరణం, నైరాశ్యం, జీవితంలోని చీకటి కోణాలను ప్రతిబింబించింది. ఆ బాధను తట్టుకోలేక, పాటలోని విషాదానికి లోనైన ప్రజలు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా నిషేధం..

ఈ పాట ప్రభావం కేవలం హంగేరీకే పరిమితం కాలేదు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు కూడా పాకడంతో.. పరిస్థితిని గమనించిన బీబీసీ, ఇతర రేడియో సంస్థలు ఈ పాటను ప్రసారం చేయకుండా నిషేధించాయి. 2003 వరకు కూడా ఈ పాటపై ఉన్న నిషేధం కొనసాగిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

కాగా సంగీతం మనిషి మానసిక స్థితిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కానీ గ్లూమీ సండే వంటి పాటలు మాత్రం సంగీతంలోని మరో చీకటి కోణాన్ని మనకు చూపిస్తాయి. నేటికీ యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ పాట అందుబాటులో ఉన్నప్పటికీ, బలహీన మనస్తత్వం ఉన్నవారు దీనిని వినకపోవడమే మంచిదని నెటిజన్లు హెచ్చరిస్తుంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *