Grey Hair in Children: పిల్లల్లోనూ తెల్లజుట్టు సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే

Grey Hair in Children: పిల్లల్లోనూ తెల్లజుట్టు సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే


పిల్లల జుట్టు రంగు వారి ఆరోగ్యం, పోషణ, శరీర అంతర్గత స్థితిని కూడా ప్రతిబింబిస్తుందట. ఇలాంటి మార్పులను సకాలంలో గుర్తించి, పరిష్కారం కనుగొనకపోతే, సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది కేవలం బాహ్య మార్పు మాత్రమే కాదు. శరీరం లోపల జరుగుతున్న ఏదైనా అసమతుల్యతను కూడా సూచికగా ఉంటుంది. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. పిల్లల్లో తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో? దీని వెనుక అసలు కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

విటమిన్ లోపం

పిల్లలలో జుట్టు తెల్లబడటానికి విటమిన్ బి12, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ల లోపం కూడా ఒక కారణం కావచ్చు. ఈ పోషకాల లోపం జుట్టు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జుట్టుకు సరైన పోషకాలు అందకపోతే త్వరగా తెల్లబడే అవకాశం ఉందని చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య అంటున్నారు.

ఇది వ్యాధులకు కూడా ఒక సంకేతమే

కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సమస్యలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు కూడా జుట్టు రంగు మార్పులకు కారణం కావచ్చు. పిల్లలలో జుట్టు వేగంగా నెరసిపోతుంటే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

జన్యువులు, జీవనశైలి కారణాలు

ఇలాంటి సమస్య కుటుంబంలో ఉంటే అది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. దీనికి తోడు అసమతుల్య ఆహారం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి కూడా పిల్లల జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రసాయనాలతో కూడిన జుట్టు ఉత్పత్తుల వాడకం, పర్యావరణ కాలుష్యం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.

తెల్ల జుట్టు రాకుండా ఎలా నివారించాలి?

ఈ సమస్యను నివారించడానికి పిల్లల ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, పాలు, పప్పులు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చాలి. వీటన్నిటితో పాటు, సరైన నిద్ర, ఒత్తిడి లేని వాతావరణం కూడా అవసరం. రసాయనాలు కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న పిల్లలలో తెల్ల జుట్టు రావడం చిన్న సమస్యగా అనిపించినప్పటికీ, అది శరీరంలోని అంతర్గత అసమతుల్యతకు సూచన అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందువల్ల దానిని సకాలంలో గమనించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *