Aadhaar Alert: నేటి కాలంలో బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. చివరికి ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ‘ఆధార్’ తప్పనిసరి. అయితే, మీ ఆధార్ నంబర్‌ను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ కష్టార్జితాన్ని కాజేస్తున్నారు. అసలు ఆధార్ ద్వారా మోసాలు ఎలా జరుగుతున్నాయి? మనం ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక ఆధార్‌పై రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయంటూ కాల్..
ఇదిలా ఉండగా, జగిత్యాలకు చెందిన అవినాష్ కాంబోడియాలో సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఓ బాధితుడి నుంచి రూ.42 లక్షలు కొట్టేవాడు అవినాష్. బాధితుడికి ఫోన్ చేసి ఒక ఆధార్‌పై రెండు ఫోన్ నంబర్ల ఉన్నాయని, ఒక ఫోన్ నెంబర్‌పై నేరాలు ఉన్నాయిన భయపెట్టి డబ్బులు వసూలు చేశాడు. మీ ఆధార్‌పై రెండు మొబైల్ నంబర్లు ఉన్నాయంటూ మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసుల్లో మొదటిసారి డబ్బులను రికవరీ చేశారు. సుమారు రూ.10 లక్షలు రికవరీ చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. కాంబోడియా నుంచి జగిత్యాలకు వచ్చిన అవినాష్ అరెస్ట్‌తో ఈ డబ్బులను రివకరీ చేశారు పోలీసులు.
ఇవి కూడా చదవండి
ఆధార్ మోసాలు జరిగే ప్రధాన పద్ధతులు:
- ఏఈపీఎస్ (AePS) మోసాలు: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా ఆధార్ నంబర్ మరియు వేలిముద్ర (Biometric) ఉంటే చాలు బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేయవచ్చు. నేరగాళ్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేదా ఇతర మార్గాల ద్వారా మీ వేలిముద్రలను సేకరించి, సిలికాన్ వేలిముద్రల సహాయంతో మీ ఖాతాలోని డబ్బును కాజేస్తున్నారు. దీనికి ఓటీపీ (OTP) అవసరం లేకపోవడం నేరగాళ్లకు వరంగా మారింది.
- ఆధార్ కేవైసీ (KYC) ఫ్రాడ్: “మీ ఆధార్ కార్డు గడువు ముగిసింది” లేదా “కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ బ్యాంక్ ఖాతా నిలిచిపోతుంది” అని నమ్మిస్తూ మీకు ఫోన్ కాల్స్ లేదా ఎస్సెమ్మెస్ (SMS)లు పంపిస్తారు. వారు పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు దొంగిలించి, తద్వారా మోసాలకు పాల్పడతారు.
- నకిలీ వెబ్సైట్లు: ఆధార్‌ను అప్డేట్ చేయడానికి అధికారిక వెబ్సైట్ (UIDAI) లాగే కనిపించే నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తారు. అక్కడ మీరు మీ వివరాలు ఎంటర్ చేయగానే, ఆ సమాచారం నేరగాళ్ల చేతికి వెళ్తుంది.
ఇది కూడా చదవండి: Gold Jewellery: బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు అవుతుంది?
మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- బయోమెట్రిక్ లాక్ (Biometric Lock): మీ ఆధార్ వేలిముద్రలను దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే, ‘m-Aadhaar’ యాప్ లేదా UIDAI వెబ్సైట్ ద్వారా మీ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయండి. మీకు అవసరమైనప్పుడు మాత్రమే అన్‌లాక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
- మాస్క్డ్ ఆధార్ (Masked Aadhaar): ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ ఇవ్వాల్సి వస్తే, పూర్తి ఆధార్ నంబర్ కనిపించని ‘మాస్క్డ్ ఆధార్’ను ఉపయోగించండి. ఇందులో చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
- ఓటీపీ షేర్ చేయవద్దు: ఆధార్‌కు సంబంధించి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే పొరపాటున కూడా చెప్పకండి. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్లో ఓటీపీలు అడగవు.
- అన్-వెరిఫైడ్ లింక్స్: వాట్సాప్ లేదా ఎస్సెమ్మెస్‌లలో వచ్చే గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఆధార్ అప్డేట్ కోసం ఎప్పుడూ అధికారిక వెబ్సైట్ (uidai.gov.in) లేదా ఆధార్ కేంద్రాన్ని మాత్రమే ఆశ్రయించండి.
- పబ్లిక్ కంప్యూటర్లు వద్దు: ఇంటర్నెట్ కేఫ్‌లు లేదా పబ్లిక్ వైఫై ఉపయోగించి ఆధార్ డౌన్లోడ్ చేయకపోవడం మంచిది. ఒకవేళ చేసినా, ఆ కంప్యూటర్ నుండి ఫైల్‌ను శాశ్వతంగా డిలీట్ చేయడం మర్చిపోవద్దు.
ఇది కూడా చదవండి: Indian Railways: ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
సాంకేతికత ఎంత పెరిగినా, మన అవగాహనే మనకు శ్రీరామ రక్ష. మీ ఆధార్ హిస్టరీని (Aadhaar Authentication History) ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి. ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు లేదా ‘cybercrime.gov.in’ లో ఫిర్యాదు చేయండి.
ఇది కూడా చదవండి: Tablets: టాబ్లెట్ మధ్యలో ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా? అది డిజైన్ కాదు.. అంతకు మించి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి