కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు.. ఎం.ఎస్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు.. ఎం.ఎస్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు


కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు.. ఎం.ఎస్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

మైలవరపు సూర్యనారాయణ, సినీ ప్రపంచానికి ఎం.ఎస్. నారాయణగా సుపరిచితులు ఆయన. తెలుగు సినిమాల్లో కమెడియన్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. తనదైన కామెడీతో నవ్వులు పూయించారు ఎం.ఎస్. నారాయణ.  1947 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించారు. వీరిది మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ దంపతుల మధ్యతరగతి రైతు కుటుంబం. పది మంది పిల్లలతో కూడిన పెద్ద కుటుంబం కావడం, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటంతో నిత్యం కష్టాలు, కన్నీళ్లతోనే జీవితం సాగింది. రోజూ ఎవరో ఒకరు పస్తు ఉండాల్సిన పరిస్థితులుండేవి.. చిన్ననాటి నుంచి చదువుపై ఎం.ఎస్. నారాయణకు మక్కువ ఎక్కువ. కుటుంబం మొత్తం పొలం పనులకు వెళ్తే, ఆయన మాత్రం బడికి వెళ్లేవారు. తండ్రికి తెలియకుండా బడికి వెళ్ళడం, అది తెలుసుకున్న తండ్రి బడిలోనుంచి ఈడ్చుకొచ్చి పొలంలో పడేయడం తరచుగా జరిగేది. పొలం పని ఎగ్గొట్టడానికే బడికి వెళ్తున్నాడని తండ్రి భావించేవారు. కానీ ఎం.ఎస్. నారాయణ ఆశయం వేరు. తన ఇంట్లో ఎవరూ ఎప్పుడూ పస్తు ఉండకూడదంటే చదువే మార్గమని బలంగా నమ్మారు. కన్నీళ్లతో తన తండ్రి కాళ్ళు కడిగి చదువుకోవాలనే తన ఆశయాన్ని వ్యక్తపరచగా, కదిలిపోయిన ఆ తండ్రి మరుసటి రోజు నుంచి దగ్గరుండి బడికి తీసుకెళ్లారు.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!

కాలేజీ రోజుల్లో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, తన కుటుంబం, చదువు కోసం వాటన్నింటినీ పంటిబిగువున భరించారు. నటుడు, కమెడియన్‌గా గుర్తింపు పొందే ముందు ఎం.ఎస్. నారాయణ గొప్ప రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగు భాష పట్ల ఆయనకున్న గౌరవం, సాహిత్యం పట్ల అభిమానం ఆయన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి. భీమవరంలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసే రోజుల్లోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. ప్రతి శనివారం మద్రాసుకు బయలుదేరి, ఆదివారం అంతా సినిమా ప్రయత్నాలు చేసి, అదే రోజు రాత్రి రైలెక్కి సోమవారం ఉదయంకల్లా తిరిగి వచ్చి పాఠాలు చెప్పేవారు. పేదరికంతో పోరాడి అలసిపోయి ఒక దశలో సినిమాలే వద్దనుకున్నారు. కానీ తనలోని కళాపిపాసి ఆయన్ను నిద్రపోనివ్వలేదు. మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా కష్టపడ్డారు.

అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె

పేపర్ ప్రకటన చూసి చెన్నై బయలుదేరారు. ఆరు రోజులు మద్రాసులో ఉంటే తన కడుపు నిండా తిన్నది కేవలం రెండు రోజులే. అయినా సరే పట్టు సడలలేదు, ఆశయం పక్కన పెట్టలేదు. ఈ ప్రయత్నాలలో రవిరాజా పినిశెట్టి, పరుచూరి బ్రదర్స్, కె. రాఘవేంద్రరావు లాంటి దర్శకుల పరిచయాలు ఆయన సినీ జీవితానికి పునాది వేశాయి. పరుచూరి గోపాలకృష్ణ గారు ఎం.ఎస్.లోని ప్రతిభను గుర్తించి అనేకమందికి రికమెండ్ చేసేవారు. కళాప్రపూర్ణ అనే అమ్మాయిని ప్రేమించిన విషయాన్ని మొదట గోపాలకృష్ణ గారిక్కే ఎం.ఎస్. నారాయణ తెలిపారు. ఆయనే దగ్గరుండి వీరి వివాహం జరిపించారు. పేకాట పాపారావు వంటి చిత్రాలకు కథా సహకారం అందించారు. దర్శకులు రవిరాజా పినిశెట్టి దగ్గర పనిచేసే రోజుల్లో యం. ధర్మరాజు M.A. సినిమాలో చిన్న పాత్ర, ఆ తర్వాత పెదరాయుడు సినిమాలో మరో చిన్న పాత్ర చేశారు. అవి నచ్చి రవిరాజా పినిశెట్టి గారు రుక్మిణి సినిమాలో పూర్తిస్థాయి కమెడియన్‌గా అవకాశం ఇచ్చారు. ఆయనకు విస్తృత గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం మా నాన్నకు పెళ్లి. అందులో ఆయన తాగుబోతు పాత్రలో నటించారు. ఆ తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చాయి. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం పదిహేనేళ్ల వ్యవధిలో దాదాపు 700 చిత్రాలకు పైగా నటించి అరుదైన రికార్డు సృష్టించారు. దూకుడు సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. నటనతో పాటు కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టి, చదువుకోవడానికి పోరాడి, సినిమా రంగంలో అపారమైన కృషి చేసి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఎం.ఎస్. నారాయణ ఎంతోమందికి ఆదర్శం. అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23న హైదరాబాద్‌లో ఆయన కన్నుమూశారు.

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *