Red Banana: పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?

Red Banana: పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?


అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, తీపి తినాలనే కోరికను తగ్గించడంలో కూడా అరటిపండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటివరకు మనం పసుపు రంగు అరటిపండ్లు లేదా పచ్చి అరటిపండ్లు తిని ఉంటాం. కానీ ఎర్ర అరటిపండ్లు ఎప్పుడైనా తిన్నారా? ఇవి కూడా ఎక్కువ పోషకమైనవని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర అరటిపండ్లను ప్రధానంగా ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్‌ దేశాల్లో పండిస్తారు. అయితే ఇప్పుడు వీటి సాగు భారతదేశంలో కూడా ప్రారంభమైంది. దీంతో క్రమంగా అన్ని మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తున్నాయి.

ఎర్ర అరటిపండ్లలో కెరోటినాయిడ్లు, విటమిన్ సి, ఆంథోసయనిన్‌ల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీరంలోని కణాల నష్టం నుండి కాపాడి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ ఎ, కెరోటినాయిడ్లు అధికంగా ఉండటం వల్ల అవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది. ఈ అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇది పేగులలో వాపును తగ్గించడం ద్వారా జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. ఎర్ర అరటిపండ్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ సి, బీటా-కెరోటిన్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *