NEET UG Admit Card 2026: నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యేది అప్పుడే.. పరీక్ష ఎప్పుడంటే?

NEET UG Admit Card 2026: నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యేది అప్పుడే.. పరీక్ష ఎప్పుడంటే?


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2026 పరీక్ష సమీపిస్తుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) త్వరలోనే అడ్మిట్‌కార్డులను కూడా జారీ చేయనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 552 నగరాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో (పెన్‌, పేపర్‌) నీట్ యూజీ ప్రవేశ పరీక్ష మే 3 (ఆదివారం)న నిర్వహించనుంది. విదేశాల్లో 14 నగరాల్లో జరగనుంది. నీట్ పరీక్ష రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశ వ్యాప్తంగా ఒకే సెషన్‌లో ఒకటే రోజున జరగనుంది.

నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 1.30 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల కోసం లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతున్నారు. గత ఏడాది నీట్‌ పరీక్షను 21 లక్షల మంది రాశారు. ఈ సారి దాదాపు 24 లక్షల మంది పోటీ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నీట్‌ పరీక్ష మొత్తం 720 మార్కులకు గాను మొత్తం 180 ప్రశ్నలకు ఉంటుంది. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టు నుంచి ప్రశ్నలు విడివిడిగా అడుగుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నలు, జువాలజీ, బయాలజీ నుంచి 90 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 180 నిమిషాలు ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *