వామ్మో.. పే..ద్ద పాము.. నడక మార్గంలో నాగరాజు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వామ్మో.. పే..ద్ద పాము.. నడక మార్గంలో నాగరాజు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. అంతటా ఉక్కపోత.. వడగాల్పులతో జనం విలవిల్లాడుతున్నారు. ఎంత తీవ్రత తాళలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. దాహంతో మూగ జీవాలు అల్లాడుతున్నాయి.. ముఖ్యంగా.. పాములు జనావాసాల్లోకి వస్తుండటంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎండ తీవ్రతను తాళలేక పాములు బయటకు వస్తుండటంతో.. అవెక్కడ కాటేస్తాయోనేమోనని కంగారు పడుతున్నారు.. తాజాగా, శేషాచలం అటవీ ప్రాంతం నుంచి కూడా పాములు బయటకు వస్తుండటంతో.. తిరుమల భక్తుల్లో ఆందోళన నెలకొంది.

తాజాగా.. తిరుమల నడక మార్గంలో నాగుపాము పడగవిప్పి.. భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. అలిపిరి మార్గంలోని మోకాళ్ళ మెట్లపై ఆరు అడుగుల పొడవైన నాగు పాము ప్రవేశించింది. నడకమార్గంలో తిరుమలకు వెళుతున్న భక్తుల కంటపడింది. బుసలు కొడుతున్న నాగుపాము (King Cobra) ను చూసి పరుగులు పెట్టిన భక్తులు.. సమీపంలో ఉన్న టిటిడి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడు కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు ఆరు అడుగుల నాగుపామును చాకచక్యంగా బంధించాడు. అనంతరం సేఫ్ గా నాగు పామును శేషాచలం కొండల్లో వదిలిపెట్టారు. దీంతో నడకదారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

తిరుమలలో ఎక్కడైనా పాములు కనిపిస్తే.. ఆందోళన చెందకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *