కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌

కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌


రోజురోజుకీ ఎండలు ముదురుతున్నాయి. ఎండతీవ్రత, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు, మూగజీవాలూ అల్లాడుతున్నాయి. ఇక పుట్టల్లో, అటవీప్రాంతాల్లో ఉండాల్సిన పాములు చల్లదనం కోసం, ఆహారం కోసం జనావాసాల్లోకి చొరబడుతూ ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటి ఆవరణలోని మొక్కల కోసం ఏర్పాటు చేసిన పొడవాటి జాలీలోకి ఎలా వెళ్లిందో పాపం ఓ కోడిపుంజు వెళ్లింది. ఇంతలో అందులోకి ఓ భారీ నాగుపాము చొరబడింది. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని వెంకటపురంలో గట్టెం బాబురావు కుటుంబం రకరకాల కోళ్లను పెంచుతుంటారు. మంగళవారం ఉదయం ఒక కోడిపుంజు జాలీలో చిక్కుకొని వింతగా అరవడం మొదలు పెట్టింది. ఏం జరిగిందా అని పరిశీలించిన కుటుంబ సభ్యులు జాలిలో కోడిపుంజుతోపాటు భారీ సర్పం కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఆ పామునుంచి తప్పించుకోడానికి కోడిపుంజు ప్రయత్నిస్తోంది.. జాలీనుంచి బయటకు రావడానికి ఎగురుతోంది కానీ జాలీ ఎత్తుగా ఉండటంతో బయటకు రాలేకపోయింది. మరోవైపు పాము పడగవిప్పి బుసలు కొడుతోంది. కోడిపుంజు అరుస్తూ ఎగురుతూ ఉండటంతో ఈ గందరగోళంలో పాము కోడిపుంజును కాటు వేసింది. పామునుంచి కోడిపుంజున ఎలాగైనా కాపాడాలని బాబూరావు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా లాభంలేకపోయింది. చూస్తుండగానే పాముకాటుతో ఆ కోడిపుంజు ప్రాణాలు వదలడంతో బాబూరావు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా ఆ పామును చంపేయాలని చూస్తారు. కానీ, బాబురావు కుటుంబం తమ కోడిపుంజును కోల్పోయినా.. పామునైనా బ్రతకనిద్దామని భావించారు. జాలిలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్న ఆ విష సర్పానికి ఎలాంటి హాని తలపెట్టకుండా సురక్షితంగా బయటకు తీసి పొదల్లోకి పంపించేశారు. విష సర్పమైనా సరే, ప్రాణానికి ప్రాణం తీయడం సరికాదని వారు తీసుకున్న నిర్ణయం స్థానికులను ఆలోచింపజేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!

TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు

ఈ వీకెండ్ సినిమా సెట్టు..OTTలో అద్భుతమైన హర్రర్ కామెడీ మూవీ..

Dhurandhar: 3వేల కోట్ల వసూళ్లతో.. ఇండియాలోనే ‘నెంబర్ 1’ గా ధురంధర్

V.V. Vinayak: అసలు మహేష్‌ను ఛాన్స్‌ ఎందుకు అడగాలి ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *