బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల భారీ వసూళ్లతో.. రేర్ రికార్డు నెలకొల్పాయి. దీంతో భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫ్రాంచైజీగా ధురంధర్ ఇప్పుడు రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో ‘బాహుబలి’ రెండు పార్ట్స్ కలిపి 2,438 కోట్లు రాబట్టగా.. , ‘పుష్ప’ మూవీ రూ. 2,092 కోట్లు రాబట్టి.. అత్యున్నత స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమా ఫ్రాంచైజీలను ధురంధర్ అధిగమించింది. ప్రస్తుతం ధురంధర్ ఫ్రాంచైజీ మొత్తంగా రూ. 3,025.97 కోట్లను వసూలు చేసింది. ఇందులో మొదటి భాగం రూ. 1,307.35 కోట్లు రాబట్టగా, ‘ధురంధర్-2: ది రివేంజ్’ ఏకంగా రూ. 1,718.62 కోట్లతో ప్రభంజనం సృష్టించింది. ధురంధర్-2 చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే భాషలో రూ. 1,000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా కూడా అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల షోలతో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం, ఇప్పటికి రిలీజై 26 రోజులు అవుతున్నా కూడా.. తన జోరును కంటిన్యూ చూస్తేనే ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
V.V. Vinayak: అసలు మహేష్‌ను ఛాన్స్ ఎందుకు అడగాలి ??
Varun Tej: వరుణ్ తేజకు గాయం.. అపోలోలో సర్జరీ !!
Ram Charan: డెకాయిట్‌కు చరణ్ అదిరిపోయే రివ్యూ..
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీలో.. బిగ్ ట్విస్ట్
నాగార్జున వద్దు.. నా సినిమాలో శ్రీకాంతే కావాలి