Watermelon: ఈ టైమ్‌లో పుచ్చకాయను తిన్నారో మీ పని అయిపోయినట్లు.. ఎప్పుడు తినాలో తెలుసుకోండి..

Watermelon: ఈ టైమ్‌లో పుచ్చకాయను తిన్నారో మీ పని అయిపోయినట్లు.. ఎప్పుడు తినాలో తెలుసుకోండి..


భానుడి భగభగలకు శరీరం విలవిలలాడుతున్నప్పుడు, మనకు వెంటనే గుర్తొచ్చే పండు పుచ్చకాయ. కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో పుచ్చకాయకు సాటిలేదు. అయితే పుచ్చకాయను ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఆశించిన ఫలితం ఉండదని మీకు తెలుసా..? ఆయుర్వేదం ప్రకారం పుచ్చకాయను ఎప్పుడు తినాలి..? ఎప్పుడు తినకూడదు? అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

పోషకాల గని

పుచ్చకాయలో 90 నుండి 92 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. ఇందులో కేవలం నీరు మాత్రమే కాదు.. మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఎ, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

పుచ్చకాయ తినడానికి సరైన సమయం ఏది?

మనం ఏ ఆహారం తిన్నా, అది సరైన సమయంలో తీసుకున్నప్పుడే శరీరానికి వంటబడుతుంది. ఆయుర్వేదం ప్రకారం పుచ్చకాయను మధ్యాహ్నం పూట తినడం అత్యంత ఉత్తమం. ఈ సమయంలో మన శరీర జీవక్రియ వేగంగా ఉంటుంది, దీనివల్ల పుచ్చకాయ సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో ఇది శరీరాన్ని చల్లబరిచి, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.

రాత్రిపూట తింటే ముప్పేనా?

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, రాత్రి సమయంలో దీనిని తీసుకోకపోవడమే మంచిది. రాత్రిపూట తినడం వల్ల కొంతమందిలో గుండెల్లో మంట లేదా జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తవచ్చు.ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల, రాత్రిపూట తింటే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఇది మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తుంది.

డీహైడ్రేషన్‌కు చెక్

పుచ్చకాయలో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీర సమతుల్యతను కాపాడతాయి. అలసటను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. కాబట్టి ఈ వేసవిలో మీ డైట్‌లో పుచ్చకాయ ఉండేలా చూసుకోండి, కానీ సమయం మాత్రం మధ్యాహ్నమే అయ్యుండాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *