సరైన కుండీ ఎంపిక: చాలా మంది ప్లాస్టిక్ బకెట్‌లలో, చిన్న ప్లాస్టిక్ కుండీల్లో కలబందను పెంచుతూ ఉంటారు. కానీ ఇలా చెయడం కరెక్ట్ కాదు. కలబంద వేర్లు అంత లోతుగా వెళ్ళవు, కాబట్టి వెడల్పాటి, తక్కువ లోతు ఉన్న మట్టి కుండీలు ఎంచుకోవాలి. అలానే ఆ కుండీ అడుగున నీరు బయటకు వెళ్ళడానికి చిన్న చిన్న రంధ్రాలు చేయీలి.