ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ

ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి పేరుకు సంబంధించిన అధికారిక ఆంగ్ల స్పెల్లింగ్‌పై స్పష్టతనిచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ పత్రాలు, డిజిటల్ రికార్డులు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో “Amaravati” (టిఐ తో అంతమయ్యేది) అనే స్పెల్లింగ్‌ను మాత్రమే ఉపయోగించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. అమరావతి పేరును కొందరు h అక్షరాన్ని జోడించి లేదా చివర తి బదులు థి (thi) తో రాస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అస్పష్టతను తొలగించి, అన్ని రికార్డులలో ఏకరూపతను పాటించేందుకు ఈ ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వులు, లేఖలు, నివేదికలు, డిజిటల్ రికార్డులలో అమరావతి స్పెల్లింగ్‌లో h ఉండకూడదని, అలాగే ti స్థానంలో thi వాడకూడదని స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ నిర్ణయం ద్వారా అధికారిక వ్యవహారాల్లో అమరావతి పేరుకు సంబంధించి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లికి ఒప్పుకోలేదని.. నా కూతురుకి HIV ఎక్కించాడు

Undavalli Caves: బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే

Gas Cylinder Blast: టపాసుల్లా పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఇళ్లు బుగ్గిపాలు

Iran Oil Tankers: భారత్‌కు చేరిన ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్‌లు

రైలులో 163 మంది చిన్నారుల అక్రమ రవాణా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *