ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం

ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం


ఆధునికత అడుగుజాడల్లో మనం ఎంతో దూరం ప్రయాణించాం. కానీ ఆ ప్రయాణంలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన సంప్రదాయాలను వదిలేశాం. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ‘మట్టి కుండ’ ఒక రిఫ్రిజిరేటర్. ప్రతి వంటింట్లోనూ మట్టి పాత్రలే ఆరో గ్య ప్రదాతలు. కానీ నేడు ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం పాత్రల ధాటికి మట్టి పాత్రలు మూలనపడ్డాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, తరతరాలుగా ఈ వృత్తిని నమ్ముకున్న కుమ్మరి కుటుంబాల ఉపాధి ‘కుండ’బద్దలైనట్టుగా మారింది. మట్టి కుండల తయారీ దారుల పరిస్థితులపై గ్రౌండ్ రిపోర్ట్.. వేసవి కాలం వచ్చిందంటే చాలు దాహం తీర్చుకోవడానికి అందరూ రిఫ్రిజిరేటర్ వైపు పరుగులు తీస్తారు. అయితే, ఫ్రిజ్‌లోని అతి చల్లని నీరు గొంతు సమస్యలను, జీర్ణక్రియ లోపాలను కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే మట్టి కుండలోని నీరు సహజసిద్ధంగా చల్లబడటమే కాకుండా, నీటిలోని మలినాలను శుద్ధి చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కుండలో నీరు తాగడం అంటే ప్రకృతిని ఆస్వాదించడమే అని పెద్దలు చెబుతుంటారు. ఒకప్పుడు ప్రతి గ్రామంలో కుమ్మరి చక్రం తిరుగుతూ ఉండేది. కుండలు, ముంతలు, ప్రమిదలు, మట్టి పాత్రలతో ఊరంతా కళకళలాడేది. కానీ యంత్రాల రాకతో కుండలకు గిరాకీ తగ్గింది. ఉపాధి కరువవడంతో చాలామంది కుమ్మరి కుటుంబాలు తమ కులవృత్తిని వదిలి నగరాలకు వలస వెళ్లి కూలీలుగా మారుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు

ఈ ఏడాది వర్షాలు తక్కువేనట.. వ్యవసాయంపై ఆందోళన

పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

AP Heatwave Alert: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

Telangana Weather: తెలంగాణలో పెరిగిన పగటి సమయం.. కారణం ఇదే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *